ఒక అందం మరొక అందాన్ని ఆకర్షించింది మరో అందం ఇంకో అందానికి పడిపోయింది ,మొత్తానికి అందాలను ఆస్వాదించేందుకు మగాళ్లు ఎగబడ్డారు. ఆడవాళ్లు కూడా అంతే తమ అందాన్ని పువ్వు పై మకరందంలో తేనెటీగలకు వదిలేశారు. ఈ మగ ఈగలు ఊరికే ఉంటాయా లవ్ మ్యారేజ్ చీటింగ్ అక్రమ సంబంధం చివరికి నేరం మీరు చూడబోయే ఈ కథ మీకు ప్యూజులు పోగొట్టడం ఖాయం.
యూపీలో ఫిరోజాబాద్ జిల్లాలో శికో బాద్ లో డాక్టర్ దీపాలి అగర్వాల్ ఎంతోకొంత ఫేమస్ డెంటిస్ట్. ఈమె బ్యూటిఫుల్ డాక్టర్ ఆమె గ్లామర్ టౌన్ మొత్తం తెలుసు దంతాలు చూపించుకోవడానికి దీపాలి దగ్గరికి వెళ్తే కళ్ళు చల్లబడి వాటికి ఏమైనా జబ్బులు ఉన్న పోతాయి అని యూత్ సెటైర్లు వేసుకుంటారు. ఆమె అందగత్తె కాదు బెస్ట్ డెంటిస్ట్ కూడా ,అనవసరపు ఖర్చు లేకుండా చాలా తక్కువలో ట్రీట్మెంట్ చేస్తుంది అనే పేరు ఉంది ఎందుకంటే డెంటల్ ట్రీట్మెంట్ అంటే చాలు గుండెకు ఉన్న బొక్క పూడ్చుకునేంత బిల్లు వేస్తారు అనే పేరు ఉంది.
కానీ దీపాలి డిఫరెంట్ ఈమె భర్త వీరిద్దరిది కొన్నాళ్ల వరకు, ఎంతో అన్యోన్యమైన బంధం. ఆమె భర్త వ్యాపారం చేస్తూ ఉంటాడు. అలాగే మరొక జంట ఉంది ఇందులో బ్యూటీ పేరు రితిక సింగ్ ఈమె ఫ్యాషన్ బ్లాగర్, కొత్త కొత్త ఫ్యాషన్ డ్రెస్ లను చూపిస్తూ అందాలతో మత్తెక్కించేది, ఇన్స్టా నుండి ఫేస్బుక్ వరకు ఆమెకు వేళల్లో ఫాలోవర్స్ ఉన్నారు. రోజురోజుకు ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతుంది ఈ రితికా సింగ్ భర్త పేరు ఆకాష్ గౌతం ఇతను వ్యాపారం చేస్తాడు. అయితే ఒకానొక ఫ్రెండ్ పార్టీలో రితికా సింగ్ కాస్త డాక్టర్ దీపాలి భర్తకు పడిపోయింది. ఒకే మీటింగ్లో ఇద్దరు చూపులు కలిసాయి ఒకరి అందం మరొకరిలో కామాగ్ని రగిలించింది.
ఇంకేముంది ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు అందుకోసం ఏకంగా దీపాలి భర్త తన ప్రియురాలి కోసం పెళ్ళాన్ని వదిలేసి ఆమె వెంట తిరగడం మొదలు పెట్టాడు. దీపాలి భర్త అయిన విపుల్ కి అందం డబ్బు ఉంది ఆ రెండిటికీ మ్యాచింగ్ కుదిరింది, రితిక విపుల్ బహిరంగంగా కలిసి తిరగడం మొదలుపెట్టారు ఈ విషయం కాస్త మొదటిగా కాస్త ఆలస్యంగా రితిక భర్తకు తెలిసింది. అతను తన భార్యకు ప్రియుడికి వార్నింగ్ ఇచ్చాడు కానీ వర్కౌట్ కాలేదు, దీంతో ఆకాష్ సరాసరి దీపాలి దగ్గరికి వెళ్లి నీ భర్త నా పెళ్ళాన్ని తగులుకున్నాడు ఇదేం పద్ధతి అని బాంబు పేల్చాడు. నువ్వు కూడా అందంగానే ఉన్నావు కదా, నేను మొగుడికి ఇదేo పోయేకాలం నా పరువు తీసాడు అని సీరియస్ అయ్యాడు.
అతని మాటలను దీపాలి నమ్మలేదు అప్పుడు ఫోటోలు కూడా చూపించాడు రహస్యంగా ఇద్దరినీ ఫాలో అయ్యి వారిని ఫోటోలు తీస్తాడు ఒకరికొకరు చాక్లెట్స్ తినిపించుకుంటూ సినిమా హాల్లో చేతిలో చేయి వేసుకుంటూ చూస్తూ రొమాంటిక్గా ఉన్నారు. ఇది చూసిన దీపాలి షాక్ అయిపోయింది పగలు మాత్రం పతివ్రతలా ఉండే భర్త విపుల్ ఇలా తిరుగుతున్నాడని కలలో కూడా ఊహించలేదు. ఆమె దీంతో భర్త రాగానే కడిగిపారేసింది.
ఇంత నీచమైన మనిషి అని అనుకోలేదు చదువుకున్నావు, నీకు ఇదేం బుద్ధి మంచి ఫ్యామిలీ అని మీ వాళ్ళు మా ఇంటికి వచ్చి చెప్పారు. ఇదేనా నీ మంచి ఇదేనా మీ అమ్మానాన్న పెంపకం అని వంశం నుండి తిట్టడం మొదలుపెట్టింది. ఇద్దరికీ మాట పెరిగింది మరోవైపు ఇటు రితికా సింగ్ ప్రవర్తనపై విసిగిపోయిన ఆమె భర్త ఆకాష్ తమ అత్తమామలకు చెప్పాడు రితిక తల్లిదండ్రులకు ఫోటోలు చూపించి నీ కూతురు ఎలా తిరుగుతుందో చూడమని చూపించారు. ఇంకేముంది రితిక పేరెంట్స్ కి నోటి మాట రాలేదు తన కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.