అందుకే నా భార్యను ఎవరికీ చూపించను

విక్టరీ వెంకటేష్ ఒక పేరున్న నిర్మాత కొడుకు అయినప్పటికీ, తనంతట తాను ఎంతో కష్టపడి టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ గా ఎదిగి, విక్టరీ అనే అత్యుత్తమమైన బిరుదును కూడా పొందారు, స్టార్ నటులు చిరంజీవి, నాగార్జున వంటి నటులు తరచూ మీడియాలో, వారి భార్యాబిడ్డలతో కనిపిస్తూ ఉంటారు కానీ, వెంకటేష్ భార్య పిల్లలు మాత్రం మీడియా కి అంత గా కనిపించరు.

వెంకటేష్ ఇంత మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు అంటే, దానికి కారణం వెంకటేష్ తండ్రి డి.రామానాయుడు మాత్రమే కాదు, వెంకటేష్ సతీమణి నీరజారెడ్డి కూడా, మరి ఆమె గురించి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడు వెంకటేష్, తన తండ్రి డి రామానాయుడు గారు వెంకటేష్ కి మంచి అమ్మాయితో పెళ్లి చేయాలని అనుకున్నారు,

అదే విషయాన్ని ప్రముఖ నిర్మాత అయిన అయినా విజయ నాగిరెడ్డి గారికి చెప్పారట, అప్పుడు ఆయన మీ సామాజిక వర్గం గురించి నాకు తెలియదు కానీ, మా బంధువులలో ఒక మంచి అమ్మాయి ఉందని చెప్పారట, దానికి రామానాయుడుగారు నాకు అలాంటి పట్టింపులు లేవు అని అన్నారట, ఆ తర్వాత వెంకటేష్ నీరజారెడ్డి కి ఒకరికి ఒకరు నచ్చడంతో, వీరిద్దరికీ స్నేహితులు బంధువుల మధ్య 1985లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

వెంకటేష్ నీరజారెడ్డి కి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి కొడుకు పేరు అర్జున్రామంత్, కూతుర్లు ఆశ్రిత, వాహిని, భావన, వెంకటేష్ విదేశాలలో తన చదువుని పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే, మరి నీరజారెడ్డి కూడా అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసింది, నీరజారెడ్డి వెంకటేష్ షూటింగ్ కి వెళ్లేముందు దేవుడికి పూజ చేసి ఆ హారతిని వెంకటేష్ కి ఇవ్వడం, వెంకటేష్ క్షేమంగ ఉండడానికి, అతనికి ఎదురు రావడం వంటివి చేస్తూ ఉంటుందట…