అధిక శ్రావణమాసం ప్రారంభం అధికమాసంలో పొరపాటున కూడా ఈ పనులు చెయ్యకూడదు

సూర్య సంక్రమణం లేని మాసాన్ని అధికమాసం అంటారు. సూర్యుడు ఒక రాశిలో నుండి మరొక రాసి లోనికి 30 రోజులకు ఒక్కసారి మారుతూ ఉంటాడు. సూర్యుడు 30 రోజులపాటు ఒక రాశిలో ఉంటాడు, 30 రోజుల తర్వాత మరొక రాసి లోనికి వెళ్ళిపోతాడు. అలా ఒక రాసి నుండి ఇంకొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు.

అయితే రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి సూర్యుడు ఒకే రాశులు 60 రోజులు ఉండిపోతాడు. రవి సంక్రమణం ఉండదు, అలా రవి సంక్రమణం లేని మాసాన్ని అధికమాసం అని అంటారు. దీనిని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మాసం అంటే పురుషోత్తముడైనటువంటి శ్రీవారికి చాలా ఇష్టం.

ఈ సంవత్సరం వచ్చేది అధిక శ్రావణమాసం, అధికమాసం అంటే దేనికి పనికిరాని మాసం అని, మలిన మాసం అని మహిళా మాసం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అధికమాసం అనేది భగవన్నామ స్మరణకు దైవ నామస్మరణకు నది స్నానానికి దీప దానాలకు, ఎంత పవిత్రమైనదని పురాణాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ అధికమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు.

చేస్తే ఏడు తరాల దరిద్రం చుట్టుకుంటుంది, కష్టాలు అనుభవిస్తారు అనే శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి అధికమాసంలో ఏ పనులు చేయకూడదు, అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఒకసారి చూత మహర్షి నైమిశారణ్యంలో ఋషులకు అధికమాస మహత్యం గురించి ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ఋషులారా ఇప్పుడు నేను పురుషోత్తమ మాస గొప్పతనాన్ని తెలిపే కథ వివరించబోతూ ఉన్నాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పసాగాడు.

పూర్వం సుదేవుడు అనే ఒక బ్రాహ్మణుడి ఉండేవాడు, అతను ధార్మికమైన భక్తి ప్రవర్తలతో కూడిన జీవితం గడుపుతూ ఉండేవాడు, అతని భార్య పేరు గౌతమి, ఆమె గౌతమ రుషి కుమార్తె, వారు గృహస్థ ఆశ్రమ ధర్మాలు అన్నిటిని కూడా చక్కగా నిర్వర్తించేవారు. కానీ, వారికి పిల్లలు లేరు ఒకసారి సుదేవుడు తన భార్య గౌతమితో ఇలా చెప్పాడు, ఓ గౌతమి పుత్రులు లేని ఈ మానవ జీవితం వ్యర్థం కాబట్టి, నేను వెనువెంటనే మరణించాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు గౌతమి సుధీవునితో ఓ స్వామి దయచేసి ఆ విధంగా మాట్లాడకండి. మీరు వైష్ణవులు కావున ఇలాంటి పరిస్థితులలో స్థిరచిత్తంతో ఉండాలి, మీకు పుత్రుడు కావాలనుకుంటే జగన్నాథుని ప్రార్థించి, పుత్రుని వరంగా అడగండి. ఆ మాటలు విన్న సుదేవుడు తామ్రపర్ని నది ఒడ్డున 4000 సంవత్సరాలు తపస్సు చేశాడు, శ్రీహరి ఆ తపస్సుకు మిర్చి గరుడ వాహనంపై ప్రత్యక్షమయ్యాడు.