అన్న నీకు వందనం….

ఆకలి ఆకలి అలసట ఎవరు ఎరుగరు, కడుపులో పేగులు ముడతలు పడి, పిడికెడు మెతుకులు తలదాచుకోవడానికి తావులేక అలమటిస్తున్న మనుషులు ఎందరో, బుక్కెడు బువ్వ కోసం చేస్తున్న పోరాటాలు ఎన్నో, వాళ్ళ ఆకలి బాధలు ఎవరికి కనిపిస్తాయి, పల్లె బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక అభాగ్యురాలి కడుపులో ఆకలి పేగుల మోతలు ఎవరికీ వినిపిస్తాయి, ఆ తల్లి కష్టం ఎవరికి కనిపిస్తుంది.

కళ్ళలో కలపాటి ఆశలు మొలిపించుకొని, గుండెలపై వలస ముద్రలని పొడిపించుకొని, దిగులు గుడ్డల్ని మోసుకెళ్తున్న ఈ అభాగ్యురాలి ఆకలి తీర్చేందుకు ఒక ఆర్టీసీ కండక్టర్, భక్తుల సుధాకర్ అనే అన్న. ఈ అన్నది సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం శిల్పకుంట్ల ఊరు సూర్యాపేట ఆర్టీసీల కండక్టర్ కొలువు చేస్తాడు.

ఆయన సూర్యాపేట నుంచి హైదరాబాద్కు వెళ్తున్న వేళ ఒక పసిబిడ్డతో బస్సు ఎక్కింది ఒక తల్లి, ఆకలితో ఇబ్బంది పడుతుందని గమనించాడు, ఆ తల్లిని తన చెల్లి లెక్క అనుకున్నాడు, తన కడుపు మార్చుకొని ఆయన సద్దితో పసిబిడ్డ తల్లి కడుపు నింపాడు.భర్త కోసం చంటి బిడ్డతో పల్లె నుండి పట్నం బాట పట్టింది ఒక అభాగ్యురాలు, పరిస్థితుల ప్రభావము ప్రకృతి విలయము తెలియదు కానీ, భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.

ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితి అన్న ఆకలి అనగానే తన సద్దిని పసిబిడ్డ తల్లికి దగ్గరుండి వడ్డించిండు ఒక కండక్టర్ సుధాకర్. చివరికి తల్లిని తన భర్తకు అప్పగించి మానవత్వం ఇంకా ప్రాణాలతోనే ఉందని నిరూపించాడు, ఇప్పుడు ఆ భాగ్యురాలికి అతని ఆపద్బంధువు అయ్యాడు. కానీ అయినవాళ్లే పట్టి పట్టనట్టు ఉన్న ఈ కాలంలో, తన కడుపు మార్చుకొని ఇంకొకరికి కడుపు నింపడానికి సుధాకర్ పడ్డ తపన అందరికీ ఆదర్శంగా నిలిచింది. అన్న నీ గురించి ఎంత రాసిన, ఏమి రాసిన తక్కువే అన్న నీకోసం మేము ఏం చేయగలం.