ఏదో ఒక రకంగా రుణ బాధ అనేటటువంటిది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ రుణము మితిమీరన్నంతవరకు అయితే పర్వాలేదు కానీ, మితిమీరిపోయే అప్పులు ఎక్కువ అయిపోయే, రుణ బాధలు పెరిగిపోయి,
అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీద పడిపోతూ ఉంటే, లేదా వాళ్ళు ఎప్పుడు ఇంటి మీద పడతారు అని మనం భయపడుతూ ఉంటే, అంతకంటే నరకప్రాయమైనటువంటి జీవితం ఇంకొకటి లేదు.
అయితే అలాంటి రుణ బాధలు అప్పులు తీరడం కోసం, ఒక అద్భుతమైనటువంటి ఒక పరిహారాన్ని తెలుసుకుందాం. దీనిని శ్రద్ధగా చేసే సంవత్సరం తిరిగే లోపు మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోయే, కొంత బ్యాలెన్స్ లోకి బ్యాంకు బాలన్స్ లోకి మీరు వచ్చేస్తారు. ఇది కచ్చితంగా పరిహారం చాలామంది చేశారు, ఫలితాన్ని పొందారు. ఆ యొక్క పరిహారాన్ని జాగ్రత్తగా చూడండి. మనకి వినాయక చవితి నవరాత్రులు అంటే గణపతి నవరాత్రులు వస్తాయి, భద్రపద శుద్ధ చవితి రోజున మొదలు పెట్టి, తొమ్మిది రోజులపాటు గణపతిని నవరాత్రులుగా పూజిస్తాం.
నవరాత్రి పూజలతో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం. అయితే ఈ నవరాత్రులకే ఒక గొప్ప విశేషం ఉంది. ఈ నవరాత్రులలో కనుక మనం మనస్ఫూర్తిగా శ్రద్ధగా కనుక గణపతి ఆరాధన చేస్తే, గణపతి వెంటనే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే గణపతికి ఉన్నటువంటి రూపాలలో ఒక రూపం రుణ విమోచక గణపతి అంటారు. అంటే అప్పులన్నింటినీ కూడా రుణ బాధలన్నింటినీ కూడా తగ్గించేటటువంటి వాడు, రుణ విమోచక గణపతి. ఈ గణపతి నవరాత్రులలో వినాయక చవితి రోజు నుండి మొదలుపెట్టి, మూడు రోజులు గాని లేదా నవరాత్రుల తొమ్మిది రోజుల్లోనూ ఏదో ఒక మూడు రోజులపాటు గనుక, మీరు గణపతిని గరికతో పూజిస్తే, ఓం గం గణపతయే నమః 108 సార్లు చదువుతూ 108 గరికపోచలు పెట్టడం.
అదేవిధంగా ఓం శ్రీ గణేశ రుణ చ్చింది నమః అనేటటువంటి మంత్రంతో ఒక 108 సార్లు గరికపోసతో గణపతి దగ్గర పెట్టడం. అదేవిధంగా ఓం శ్రీ రుణ విమోచక గణపతయే నమో నమః తో 108 సార్లు చక్కగా గరికపోజలని గణపతి దగ్గర పెట్టడం. చేసి గణపతికి బెల్లం ముక్క అంటే చాలా ఇష్టం ఎందుకంటే, గణపతి గజస్వరూపం కాబట్టి గజము అంటే ఏనుగుకి చెరకు గడలంటే ఇష్టం. అందుకని గజరూపుడైనటువంటి గణపతికి ఆ చెరుకు నుంచి తయా రైనటువంటి బెల్లం అంటే చాలా ఇష్టం. అందుకని బెల్లం ముక్క నైవేద్యం పెట్టి గణపతిని గరికతో కనుక మీరు పూజించారంటే, కచ్చితంగా గణపతి అనుగ్రహించేస్తాడు. ప్రతి బుధవారం నాడు గణపతిని గరికతో పూజించి, ఈ మంత్రాలతో గనక మీరు ఆరాధన చేశారంటే, కచ్చితంగా మళ్ళీ వినాయక చవితి వచ్చేటప్పటికి మీ అప్పుల బాధ నుండి బయటపడతారు.