అర్ధరాత్రి గర్భిణీ తో ఉన్న ఆవు ని కలవడానికి వస్తున్న చిరుత పులి.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయిన గ్రామస్థులు

చిన్నతనం లో మనమందరం చదువుకున్న ఆవు-పులి కథ గుర్తుండే ఉంటుంది. పులి ఆ ఆవుని బ్ర.. తికి ఉంచదు అని తెలిసి కూడా తింటుంద‌ని తెలిసి కూడా ఆవు ఇచ్చిన మాట ప్ర‌కారం పులి ద‌గ్గ‌ర‌కి వ‌స్తుంది. అది నీతి క‌థ‌. క‌థ కాబ‌ట్టి పులి ఆవును వ‌దిలేసింది. నిజానికి పులి కంట ఆవు క‌నబ‌డితే వ‌దిలేస్తుందా? అస్సలు వొదలదు. ఎందుకంటే పులి క్రూ.. ర జంతువు. ఈ రెండు జంతువుల‌కి జాతి ఎప్పటి నుంచో జాతి వై..రం వుంది.

పులి ఆక‌లి తీర్చుకోవాలంటే సాధు జంతువుల‌ను వే.. టా.. డాలి. దానికి ఆకలి అనిపిస్తే త‌న కంటి ముందు ఏ సాధు జంతువు నైనా విడిచిపెట్టదు. అలాంటిది ఒక చిరుత పులి సాధు జంతువు అయిన ఆవు తో స్నేహం చేస్తుంది. ప్ర‌తి రోజు రాత్రి ఆ చిరుత‌ వ‌చ్చి ఆవు ద‌గ్గ‌ర నిద్రించి, కాసేపు విశ్రాంతి తీసుకొని మ‌ళ్లీ అడ‌విలోకి వెళ్లిపోతుంది. జాతి వై..రం మ‌రిచి స్నేహంగా ఉంటున్న వీరి బంధం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైర‌ల్ గా మారింది.

మీరు ఈ వీడియో చూసినట్లయితే ఒక ఆవు సావిట్లో చిరుత క‌నిపిస్తుంది. ఆ చిరుత ఆవును తినడానికి రాలేదు. ఆ చిరుత‌కి, ఆవుకి మంచి మితృత్వం వుంది. జాతి వై.. రం మ‌రిచి ముస్తాఫా ముస్తాఫా అంటున్న ఆవు-చిరుత ఫ్రెండ్ షిప్ గుజ‌రాత్ లోని కంటోని అనే గ్రామంలో జరుగుతుంది . కంటోని గ్రామం అట‌వీ ప్రాంతానికి దగ్గరలో వుంటుంది. అందులోనూ ఈ గ్రామంలో చెరుకు తోట‌లు ఎక్కువ‌గా వుంటాయి.

కొన్నేళ్ల క్రిందట ఒక చిరుత ఆ గ్రామం పై దా.. డి చేసింది. ఆ టైం లో ఆ గ్రామంలో క‌నిపించిన ప్రతి జంతువు మీద‌, మ‌నుషుల మీద దా..డి చేసింది. ఆ ఊరి పై దా.. డి చేసే స‌మ‌మంలో చిరుత పులి బాలింత‌.. దానికి ఒక చిరుత పిల్ల పుట్టింది. ఈ చిరుత దా..డి త‌ట్టుకోలేక గ్రామ‌స్తులు ఫారెస్ట్ ఆఫీసర్స్ కు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్ల త‌ర్వాత అట‌వీశాఖ అధికారులు,

గ్రామ‌స్తుల సహాయంతో చిరుత పులిని ప‌ట్టుకుని ఆ గ్రామానికి దూరంగా ఉన్న కొన్ని వంద‌ల కిలోమీట‌ర్ల దూరంలో అడ‌విలో వొదిలిపెట్టారు. సరిగ్గ నెల రోజుల త‌ర్వాత అదే గ్రామంలో ఇంకో చిరుత సంచరించడం గ‌మ‌నించారు గ్రామ‌స్తులు..కాకపోతే అది పెద్ద చిరుత కాదు చిరుత పిల్ల‌..ఈ చిరుత పెద్ద చిరుత పిల్ల అని గ్రామ‌స్తుల కు అర్థమైంది. చిరుత పిల్లే క‌దా అని ఊరికే ఉండలేదు. మ‌ళ్లీ ఫారెస్ట్ ఆఫీసర్స్ కి స‌మాచారం అందించారు.

ఈ సారి చిరుత పిల్ల‌ని పట్టుకోవ‌టానికి వ‌చ్చిన అధికారులు గ్రామ‌స్తులు చెప్పిన మాట‌లు విని ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ గ్రామంలో ఒక వ్య‌క్తి వద్ద కోళ్లు, మేక‌లు, ఆవులు, గేదెలు ఎక్కువ‌గా వుండేవి. చిరుత పిల్ల ప్ర‌తి రోజు రాత్రి ఆ ప‌శువుల వద్దకు వ‌చ్చి మళ్ళి తిరిగి వెళ్ళేది. అయితే ఏ జంతువుకి హాని త‌ల‌పెట్టేది కాదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ చిరుత పిల్ల ఒక ఆవు ద‌గ్గ‌ర‌కి వెళ్లి నిద్రపోయేది.

చిరుత పిల్ల ఆ ప‌శువుల‌దొడ్డిలోకి వెళ్లడం అక్క‌డ ఆవు ని కలవడం ఆ గ్రామ‌స్తులు కూడా చూశారు. అయితే ఫారెస్ట్ అధికారులు చిరుత పిల్ల ని ప‌ట్టుకోవాల‌నుకున్న రోజు నుంచి ఆ ప‌శువుల దగ్గరికి ఆ చిరుత పిల్ల రావ‌టం మానేసింది. చిరుత పిల్ల ఆవు వద్దకు వ‌చ్చి నిద్రపోయే దృశ్యాల‌ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఇక ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.