ఆలుగడ్డ గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన రహస్యం

బంగాళదుంపలు అంటే అందరూ ఇష్టపడుతూ ఉంటారు. మెత్తగా, తేలికగా ఉడుకుతాయి. తినేటప్పుడు కూడా రుచికరంగా లోపలికి వెళ్ళిపోతాయి. అలాంటి బంగాళాదుంపలు మనం తిన్నప్పుడు ఆ తర్వాత చాలాసేపు ఆకలి సరిగ్గా వేయదు. ఇలా బంగాళాదుంప తిన్న తర్వాత ఆకలి సరిగ్గా వేయలేదు అంటే దానికి ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అని చూస్తే రెండు రకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి బంగాళదుంప 100 గ్రాములు తీసుకుంటే అందులో 97 క్యాలరీల శక్తి ఉంటుంది. కూరగాయలలో 100 గ్రాములు తీసుకుంటే 20-25 క్యాలరీలు శక్తి మాత్రమే ఉంటుంది.

అంటే కూరగాయలతో పోలిస్తే నాలుగు వంతులు ఎక్కువ శక్తిని బంగాళదుంప అందిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి తేలికగా డైజెస్ట్ అయిపోయి రక్తంలో కరిగిపోతాయి. అందువలన బాడీ చాలా సేపు శక్తి అవసరం లేదు కాబట్టి ఆహారాన్ని కోరాదు. ఇది అందరికీ తెలిసిందే రెండవ రీజన్ ఏమిటంటే బంగాళదుంప తిన్న తరువాత అందులో ఉండే ఒక కెమికల్ పొటాటో ప్రోటీన్స్ ఇన్హీబీటర్ 2 అనేది ఇందులో ఉంటుంది. ఇది మన పొట్ట, పేగులకు వెళ్లిన తర్వాత కోలీసీస్టోకైనీన్ అనే దానిని ఉత్పత్తి చేస్తుంది.

ఇది ఎక్కువగా రిలీజ్ అయ్యే సరికి ఆకలి వేయదు. ఈ కాంపౌండ్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఆకలి తగ్గిపోతుంది. తక్కువగా రిలీజ్ అయినప్పుడు ఆకలి ఎక్కువ అవుతుంది. అందువల్ల బంగాళదుంప తిన్న తర్వాత ఆకలి వేయక పోవడానికి ఇదొక కారణం. మరియు బంగాళదుంప వండే తీరును బట్టి ఆకలి వేయడం, వేయకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. బంగాళదుంప ఉడకబెట్టుకొని కూర లాగా చేసుకుని తింటే మాత్రం ఆకలి వేయదు. అదే బంగాళదుంపని మనం డీప్ ఫ్రై చేసి తిన్న, చిప్స్ రూపంలో తిన్న ఇందులో ఉండే కొలీసీస్టోకైనీన్ అనే కెమికల్ కాంపౌండ్ ఎక్కువగా ఉత్పత్తి కాదు.

అందువలన ఆకలి ఎక్కువగా వేస్తుంది. ఎందుకంటే డీప్ ఫ్రై చేసినప్పుడు అందులో ఉండే వేడికి మెకానిజం మొత్తం మారిపోతుంది. దీనివల్ల సైంటిఫిక్ గా కూడా చిప్స్ గాని, డీప్ ఫ్రై లు తిన్నప్పుడు ఆకలి బాగా వేస్తుంది. రివర్స్ లో పనిచేస్తుంది అని, నాచురల్ గా ఉడకబెట్టుకొని చప్పగా తిన్నప్పుడు ఈ మెకానిజం బాగా పనిచేస్తుంది అని 2016లో శ్రీలంక వారు దీనిపై పరిశోధనలు చేసి నిరూపించారు. అందుకనే వండుకునే తీరు కూడా మనం తక్కువ, ఎక్కువ తినడానికి కారణం అవుతుంది…