ఈ సృష్టిలో అత్యంత గౌరవమైన వ్యక్తి డాక్టర్. వీరు నిరంతరాయంగా పనిచేస్తూ ఉండవలసి వస్తుంది. ఈ క్రమంలో వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి సమయం ఉండదు. ఎందుకంటే వారికి ఏ టైంలో ఎటువంటి ప్రమాదంలో వున్న సమస్య ఎదురవుతుందో కూడా తెలియదు. వీరు ఆరోగ్య నిపుణులు అయినప్పటికీ సమయానుకూలంగా ఆహారం తీసుకోవడం కుదరదు. మరి ఒక్కొక్క సమయంలో ఆపరేషన్ వంటివి చేయవలసి వచ్చినప్పుడు ఆరు, ఎనిమిది గంటల వరకు అలా ఉండిపోవాల్సి వస్తుంది. అందువలన నీటిని కూడా సక్రమంగా తీసుకోరు.
అంతేకాకుండా వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి డాక్టర్స్ కి ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అందువలన వారికి కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. కనుక వారు ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ వహించాలి అనుకున్న కుదరకకపోవడం వలన షుగర్ వంటివి త్వరగా ఎఫెక్ట్ అవుతాయి. వీరు ముఖ్యంగా మానసిక ఒత్తిడి నుంచి విడుదల పొందడానికి వ్యాయామాలతో పాటు ఆటలు కూడా ఎక్కువగా ఆడుతూ ఉండాలి. వ్యాయామాలు ఎంత చేసినప్పటికీ మానసిక ఒత్తిడి నుంచి విడుదల పొందలేరు.
అందువలన ఆటలు ఎక్కువగా ఆడుతుంటే మైండ్ రిలాక్స్ అవుతుంది. దీనితోపాటు వీరు రోజు నాలుగు లీటర్ల నుంచి ఆరు లీటర్ల వరకు నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నీటిని తీసుకోవడం ద్వారా డిటాక్సీఫీకేషన్ సక్రమంగా జరుగుతుంది. దీనివలన వీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతేకాకుండా వీరు రోజుకు రెండుసార్లు తినే పద్ధతిని అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఇలా అలవాటు చేసుకోవడం ద్వారా వారి ఆరోగ్యం బాగుంటుంది. అంటే రోజు ఉదయం 10 గంటల లోపు భోజనం ముగించాలి. దీనిలో డ్రై నట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన రోజు మొత్తం చాలా యాక్టివ్ గా ఉంటారు.
మరియు రెండోదిగా సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయంలో వారి భోజనం ముగించాలి. ఈ సమయంలో కావాలి అనుకుంటే ఉడికించిన ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇలా ఉదయం సమయంలో డ్రై నట్స్ అనగా బాదం, జీడిపప్పు, వేరుశనగపప్పు, పుచ్చ పప్పు వంటివి ఆహారంగా తీసుకోవడం వలన దాని నుంచి శక్తి వలన త్వరగా ఆకలి వేయదు అంతే కాకుండా ఆ శక్తితో సుమారు 8 గంటల వరకు యాక్టివ్గా తమ పనిని చేసుకోవచ్చు. ఇలా రోజుకు రెండుసార్లు ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేస్తూ ఆటలు ఆడడం ద్వారా డాక్టర్స్ కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.