ఒబేసిటీ ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉన్న సమస్య. థైరాయిడ్ వలన బరువు పెరగడం కంటే ఒబేసిటి వలన ఎక్కువ బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడానికి ఏదైనా బరువు తగ్గడానికి డైట్ ప్లాన్ చాలా ముఖ్యం. అధిక బరువు పెరుగుతున్న ఒబెసిటీ వస్తుందన్న మనం తీసుకునే ఆహారం దానికి కారణం. ఒబేసిటీ తగ్గాలన్న ఒబేసిటీ వల్ల వచ్చిన బరువు తగ్గాలన్నా సరే మంచి ఆహార నియమాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ కేలరీలు తక్కువ పోషకాలు ఉన్నాయి.
దీని వల్ల బరువు పెరుగుతున్నారు. తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మనం ప్రతిరోజు ఇంట్లో వండే ఆహారాలు మాత్రమే తింటున్నాము. అయినా సరే ఎందుకు బరువు పెరుగుతున్నాము అంటే ఉప్పు, కారం, నూనె, మసాలా వంటి వాటి వల్ల బరువు పెరుగుతారు. రోజులో ఒక పూట నీకు ఇష్టమైన ఆహారాన్ని తిని మిగిలిన రెండు పూటలు తక్కువ కాలరీలు ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు.
మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా పోషకాలు తక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువగా అన్నం తక్కువ కూర వేసుకొని తింటాం. దీని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. అందుకే మీకు ఇష్టమైన ఆహారాన్ని రోజులో ఒక పూట మాత్రమే తీసుకుని ఉదయం రాత్రి ఈ డైట్ ఫాలో అయితే సరిపోతుంది. బరువు తగ్గడానికి ముఖ్యంగా కావలసినవి రెండు ఒకటి డైట్ ప్లాన్, రెండవది వ్యాయామం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా మొలకలు డ్రై నట్స్ డ్రైఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకోవాలి.
రాత్రి ఆహారంలో కూడా ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్స్, నానబెట్టిన డ్రై నట్స్ లేదంటే నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. వీటిలో తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు లభిస్తాయి. దీని వల్ల మన శరీరానికి కావలసిన శక్తి లభించదు. శక్తి కోసం శరీరంలో ఫాట్ కరిగించుకుంటుంది. ఫాట్ బర్నింగ్ అవ్వడం వలన బరువు చాలా స్పీడ్ గా తగ్గుతారు. ఈ డైట్ ప్లాన్ ఫాలో అయినట్లయితే వారంలో 750గ్రాముల బరువు తగ్గుతారు. దీనితో పాటు వ్యాయామం కూడా చేసినట్లయితే ఇంచుమించు వారంలో 2 లేదా 3కేజీల వరకు బరువు తగ్గుతారు.
ఒబేసిటీ తగ్గాలన్న, కంట్రోల్లో ఉండాలన్న, రెగ్యులేట్ చేయాలన్నా డైట్ ప్లాన్, వ్యాయామం తప్పనిసరి.డైట్ ప్లాన్ తో పాటు వ్యాయామం కూడా చేసినట్లయితే ఈజీగా బరువు తగ్గుతారు.