జొన్న పిండి తో ఇలా అంబలి తయారు చేసుకొని తాగినట్లయితే ఎముకలు బలంగా తయారవుతాయి. శరీరానికి కావల్సిన కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటివి లభిస్తాయి. రాగి పిండితో అంబలి ఎలా తయారు చేసుకుంటారో అలాగే జొన్న పిండితో కూడా అంబలి తయారు చేసుకొని తాగవచ్చు. నోటికి రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ అంబలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు జొన్నలు, మిరియాల పొడి, సైంధవ లవణం, నిమ్మరసం.
మనం దీనికోసం మార్కెట్లో దొరికే జొన్నపిండి కాకుండా జొన్నలు తెచ్చుకొని ఇంట్లోనే పిండి తయారు చేసుకొని అంబలి చేసుకోవాలి మార్కెట్లో దొరికే పిండి స్వచ్ఛమైనది కాదు దానిలో వేరే పిండాలను కూడా కలిపి అవకాశం ఉంటుంది. మనం ముందుగా కొన్ని జొన్నలను తీసుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండిని ఒక మట్టి పాత్రలో వేసి ఒక కప్పు పిండి కి మూడు గ్లాసుల నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడా సైంధవలవణం వేసుకోవాలి. సైంధవ లవణం లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు.
సైంధవ లవణం జీర్ణ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. తర్వాత ఈ పాత్రను స్టవ్ మీద పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జావను గ్లాసులో వేసుకుని ఒక చిటికెడు మిరియాల పొడి, అర చెక్క నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈ జావను తాగినట్లయితే మీ ఎముకలు బలంగా తయారవుతాయి. ఈ పిండిని ఉడికించడం వలన బాగా జీర్ణం అవుతుంది. మిరియాల పొడి శరీరంలో ఉండే జలుబు, కఫం వంటి సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఈ జొన్నలతో జావను చేసుకుని ప్రతిరోజూ తీసుకున్నట్లయితే మీ శరీరానికి కావల్సిన క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఎముకల బలహీనత, కాల్షియం లోపం వంటి సమస్యలతో బాధపడేవారు జావను తీసుకోవడం వలన తగ్గుతాయి. ఈ అంబలిని వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. దీనివలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు. నోటికి రుచిగా మరి ఆరోగ్యప్రయోజనాలను ఇచ్చే ఈ అంబలి ని మీరు కూడా ప్రతి రోజు చేసుకొని తాగండి. ఈ అంబలి తాగడం వలన మీ ఎముకలు ఉక్కులాగా తయారవుతాయి.