ఈరోజు మనం ఒక లడ్డు గురించి తెలుసుకుందాం, ఇది పూర్తిగా ఔషధ గుణాలతో నిండి ఉంటుంది, ఒకవేళ మీకు ఎముకలకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, శరీరంలో క్యాల్షియం తక్కువగా ఉన్న, కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్న నరాల్లో తిమ్మిర్లు ఉన్న నడుస్తున్నప్పుడు కాళ్లు లాగుతున్నట్లుగా అనిపిస్తున్న, రాత్రి పడుకునే ముందు పిక్కలు అరికాలు నొప్పులుగా ఉన్నా,
శరీరం నిరసనగా ఉంటున్న అనగా శరీరంలో శక్తి అస్సలు ఏమాత్రం లేదు అనిపిస్తున్న, శరీరంలో నీరసం అలసట బద్ధకంగా ఉండే ఏ పని చేయాలన్నా పనిలో ఇంట్రెస్ట్ కలగకపోవడం ,తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా ,బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉన్న కంటి చూపు మందగిస్తున్న, ముఖం డల్ గా కనిపిస్తున్న ముఖంలో గ్లో లేకపోయినా ఇలాంటప్పుడు ఇలాంటి అప్పుడు ఈ లడ్డు అనేది మీకు ఒక రామబాణం లాంటి ఔషధంగా పనిచేస్తుంది. ఒక రకంగా ఈ లడ్డును మనం ఇంట్లో తయారు చేసుకునే మల్టీ విటమిన్ అని చెప్పవచ్చు.
అలాగే ఈ లడ్డు డెలివరీ అయిన తర్వాత పిల్లల తల్లులకు ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు, నియమితానుసారం ఈ లడ్డును ఇప్పుడు చెప్పిన విధంగా సేవించడం వల్ల హెల్త్ రిలేటెడ్ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ ఫాస్ట్ గా తొలగిపోతాయి. మరి ఈ లడ్డును ఎలా తయారు చేసుకోవాలో ఈ లడ్డు తయారు చేయడానికి ఏ ఏ పదార్థాలు తీసుకోవాలో అలాగే ఈ లడ్డును ఎప్పుడు ఎలా తినాలో కూడా తెలుసుకుందాం. మనం ఈ లడ్డును తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అవిస గింజలు 200 గ్రాములు, నువ్వులు 200 గ్రాములు, మీరు కావాలనుకుంటే నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు ఏవైనా సరే తీసుకోవచ్చు,
అలాగే బెల్లం 300 గ్రాములు. అయితే ఈ బెల్లం డార్క్ కలర్ లో ఉండేది మాత్రమే యూస్ చేయండి అనగా దేశ వాలి బెల్లాన్ని యూస్ చేయండి అలాగే గోధుమపిండి ఒక చిన్న కప్పు తీసుకోవాలి, ఇదే కాకుండా నెయ్యి 100 గ్రాములు మీరు కావాలనుకుంటే నెయ్యిని ఇందులో సగం కూడా యూస్ చేయవచ్చు, 40-50 గ్రాముల వరకు తీసుకున్న కూడా సరి పెట్టుకోవచ్చు,
అలాగే బాదం పప్పులు 50 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, కిస్మిస్లు 50 గ్రాములు, అలాగే 30 గ్రాముల గోంద్ తీసుకోవాలి ఇది పిల్లలకు పిల్లల తల్లులకు కీళ్ల నొప్పులకు చాలా బాగా ఉపయోగపడుతుంది, ఇది మనకు ఎక్కడైనా ఆయుర్వేద షాప్ లో కానీ పచారీ కొట్టులో కానీ లభిస్తుంది.
ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఈ లడ్డు మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది, ఈ లడ్డును వర్షాకాలంలో రోజుకి ఒకటి నుండి రెండు వరకు తినవచ్చు, ఎందుకంటే ఎక్కువ తినకూడదు, దీంతో మీ వెంట్రుకలు మరియు స్కిన్ కూడా హెల్తీగా అవుతాయి. ఇప్పుడు లడ్డు తయారీ విధానాన్ని తెలుసుకుందాం, ఇందుకోసం మనం ముందుగా తీసుకొని వాటిని వేయించుకోవాలి, నువ్వులు మంచి రంగులోకి వచ్చిన తర్వాత వాటిని వేరే బౌల్ లోకి తీసుకోవాలి,
అవిస గింజలను వేసి అలాగే వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్యాన్ లో నెయ్యి వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి, తర్వాత గొందు కూడా వేసి వేయించుకోవాలి, అలాగే మిగిలిన నెయ్యిలో గోధుమపిండి వేసి వేయించుకోవాలి, ఇప్పుడు మనం ఈ పిండిని ఏదైనా ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి, తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను రవ్వ లాగా పొడి లాగా మిక్సీ చేసుకోవాలి.
ఇప్పుడు మనం గోధుమపిండి వేయించి పెట్టుకున్న గిన్నెలోకి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి అలాగే నువ్వులు, అవిస గింజలను కూడా పొడి లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీన్ని కూడా గోధుమపిండి మిశ్రమంలో కలుపుకోవాలి, ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి. దీనికోసం మనం అలాగే బెల్లాన్ని తీసుకొని పాకం లాగా తయారు చేసుకోవాలి తర్వాత దీన్ని వడకట్టుకోండి, తర్వాత ఈ పాకాన్ని ఒక ఫ్యాన్ లో తీసుకుని స్టవ్ పై పెట్టుకొని మరిగించాలి ఇప్పుడు మనకు పాకం రెడీ అవుతుంది
ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని కూడా అన్ని పదార్థాలు వేసిన బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి, ఇప్పుడు మనం మనకు నచ్చిన సైజులో లడ్డూలను తయారు చేసుకోవాలి, నువ్వులు మరియు అవిసగింజలలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే లడ్డు చేయడానికి మనకి ఎక్కువ నెయ్యి అవసరం లేదు. ఈ లడ్డుని ఎవరికైతే కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయో వాళ్లకి ఇవ్వండి, అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉన్న అలాగే మీకు రోజంతా బద్ధకంగా అనిపిస్తున్న ఏ పని చేయాలి అన్న ఇంట్రెస్ట్ లేకపోయినా అప్పుడు కూడా ఈ లడ్డును తినండి.