ఇలా చేస్తే అప్పులన్నీ పరార్

ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలతో భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా ఎలా బయటపడవచ్చు మనం తెలుసుకుందాం. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడడానికి 21 రూపాయి బిళ్ళలకు సంబంధించిన పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ 21 రూపాయి బిళ్ళల పరిహారం ఎలా చేయాలి అంటే ఈ పరిహారం చేయాలంటే ముందు ఒక గాజు బౌల్ తీసుకోవాలి.

దాంట్లో నీళ్లు పోసి ఆ నీటిలో దొడ్డు ఉప్పు వేయాలి, ఇలా దొడ్డు ఉప్పు వేసిన తర్వాత దొడ్డుకు కలిపిన నీళ్లతో గాజు బౌల్ మొత్తం కూడా శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఆ దొడ్డు ఉప్పు కలిపిన నీళ్లు సింక్లో పారబోయాలి. అంటే ఆ గాజు బౌల్ శుభ్రంగా ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేయాలి ఇప్పుడు ఆ గాజు బౌల్ ఇంట్లో పూజా మందిరంలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ప్రతిరోజు కూడా మీరు పూజ చేసుకునే సమయంలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ గాజు బౌల్లో ఒక రూపాయి బిల్లా వేయాలి. రూపాయి బిళ్ళ వేసేటప్పుడు ఓం ఐo హ్రీమ్ క్లీమ్ చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి.

ప్రతిరోజు ఇలానే చేయండి 21 రోజులు ఈ విధంగా చేయండి రోజు ఒక రూపాయి బిళ్ళను వేస్తే 21 రోజులు పూర్తయ్యేసరికి 21 రూపాయి బిళ్ళలు ఆ గాజు బౌల్లో ఉంటాయి. మర్నాడు అంటే 22వ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ గాజు బౌల్లో ఉన్నటువంటి నీళ్లు తీసుకుని ఒక గ్లాసులో పోసి దానిలో మామిడాకులు వేసి ఆ మామిడి ఆకులతో ఈ నీళ్లు ఇల్లంతా కూడా చల్లండి ఇలా చల్లితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది.

అలాగే గాజు బౌల్ లో ఉన్న 21 రూపాయి బిళ్ళలను తీసి మీరు బీరువాలో దాచి పెట్టుకోండి వీలైతే ఆ ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలలో ఒక నాలుగు రూపాయలు నీ పర్సులో పెట్టుకోండి, అప్పుడు ఇంకా ఆర్థిక ఇబ్బందుల నుండి చాలా త్వరగా బయటపడవచ్చు.ఇది చాలా సులభమైన శక్తివంతమైన పరిహారం రోజు గాజు బౌల్లో ఒక రూపాయి బిళ్ళను వేయటం 21 రోజులు అలా వేస్తే 21 రూపాయి బిళ్ళలు గాజు బౌల్లో ఉంటాయి. 21 వ రోజు సాయంత్రం ఆ గాజు బౌల్లో నీళ్లు పోసి బయట వెన్నెల్లో ఉంచాలి, 22వ రోజు ఆ నీళ్లు తీసి మామిడి ఆకుతో ఆ నీళ్లను ఇల్లంతా చల్లాలి

ఆ గాజు బౌల్ లో ఉన్న 21 రూపాయి బిళ్ళలు బీరువాలో పెట్టుకోవాలి. వీలైతే ఆ ఇరవై ఒక్క రూపాయి బిళ్ళల్లో కొన్ని రూపాయి బిళ్ళలను పర్సులో పెట్టుకోవాలి. ఈ పరిహారం ఎప్పుడు ప్రారంభించాలి అంటే అమావాస్య తర్వాత వచ్చేటటువంటి విదియ తిధి రోజు ప్రారంభిస్తే చాలా మంచిదని పరిహార శాస్త్రంలో చెప్పారు. అమావాస్య తర్వాత వచ్చే రెండవ రోజు ద్వితీయ తిథి రోజు ఈ పరిహారం చేయండి విధియ తిధి రోజు ప్రారంభించి వరుసగా 21 రోజులు ఈ విధంగా చేయండి.