ఇష్టం లేకుండానే

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అన్నా కానీ, వచ్చిన తర్వాత అవకాశాలను ఉపయోగించుకోవాలన్నా కానీ, ఆశతోచి అడుగులు వేయాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్న అంతే సంగతులు కెరీర్లో ముందుకు వెళ్లలేరు,

ఇదే విషయాన్ని మరోసారి ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది ఒకప్పటి హాట్ ఐటమ్ బాంబు ఇప్పుడు సీనియర్ హీరోయిన్ ఇంద్రజ. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మ పాటలు ఆమె పెర్ఫామెన్స్ ను ఎన్నేళ్లయినా మర్చిపోగలమా, ఆ అందం, ఆ రూపం,

ఆ నవ్వు, ఆ రెస్పెక్ట్ అబ్బో వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్లకు మించిపోయే అందం ఉన్నా కానీ ఇంద్రజ కి కొన్ని ఆఫర్స్ చేతికి వచ్చినట్లే వచ్చి చేయి జారిపోయాయి. దానికి కారణం ఆ టైంలో ఆమె వేసిన కొన్ని తప్పటడుగులు, కెరియర్ పిక్స్ లో ఉండగానే ఐటెం సాంగ్స్ చేసే ఫామ్ తగ్గించేసుకుంది.

హీరోయిన్గా ఎదగకుండా తన కెరీర్ కి బ్రేకులు వేసుకుంది, ఆ రోజుల్లో ఇంద్రజ రెండు ఐటెం సాంగ్స్ చేసింది, నాగార్జున సరసన కన్నే పెట్టరో డాన్స్ చేసింది అలరించింది. అలాగే తమిళ సినిమాలో కూడా ఐటెం సాంగ్స్ చేసి మెప్పించింది, తాజా ఇంటర్వ్యూలో వాటి గురించి అడగగా ఇంద్రజ మాట్లాడుతూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. నిజానికి అలాంటి సాంగ్స్ చేయాలని ఏ హీరోయిన్ కి ఉండదు, పెద్ద వాళ్ళ రిక్వెస్ట్ పైన ఎక్కువగా చేస్తాం.

పెద్ద బ్యానర్ అడిగినప్పుడు మనం నో చెప్తే బాగుండదు, పెద్ద బ్యానర్ కదా అనే చాలామంది ఒప్పుకోవాల్సి వస్తుంది. నేను ఇష్టం లేకుండానే ఆ పాటలు చేశాను, అయినా ఇప్పుడు వాటి గురించి ఎందుకులెండి, ఇప్పుడు ఏమన్నా మాట్లాడిన లేనిపోని వివాదాలు వస్తాయి. అందుకే వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువగా మాట్లాడను అని చెప్పుకు వచ్చింది. అంటే ఇండస్ట్రీలో పెద్ద బ్యానర్లు కూడా హీరోయిన్ ని ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పకనే చెప్పేసింది.