ఈ ఆహారాలను కలిపి తినకూడదంట. అవేంటో చూద్దాం.

ఆరోగ్యమే మహా భాగ్యం అని మన పెద్దలు ఊరికే చేప్పలేదు. మనలో చాలా మందికి ఆహారాన్ని ఎలా తీసుకోవాలో తెలియక చాలా అనారోగ్యపాలవుతున్నారు. వీరికి అది తీవ్రమయ్యేవరకు తెలియదు మన ఆహారపు అలవాట్ల వలన వచ్చిందని. ఆకలి కాగానే ఏది ఉంటె అది తినకూడదు. కొన్ని పదార్థాలను కలిపి తినకూడదు మరి కొన్నింటిని ముందుగాని తరువాత గాని తినకూడదు. ఆహారాలను తినేటప్పుడు కొన్ని పదార్థాలను కలిపి తినకూడదు, ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె మరియు నెయ్యి కలిపి తినకూడదు, ఆ రెండింటి కలయిక విషపూరితం అయినది. పెరుగు మరియు మజ్జిగ తో అరటి పండు తో కలిపి తినకూడదు, అన్నాన్ని పండ్లతో కలిపి తినకూడదు, అలా తినడం వల్ల పండ్లలోని ఉన్న minerals తగ్గిపోతాయి. కూరగాయలతో పాటు వెన్న కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. చేపల కూర తిన్నవెంటనే పాలు కానీ పెరుగు కానీ పాల పదార్థాలు ఏవి తినకూడదు, అలా తింటే కుష్టి రోగం వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి.

లావుగా ఉన్నవాళ్ళు బియ్యంతో వండినది కాకుండా గోధుమలతో వండినవి కొద్ది మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. ఆస్తమా రోగులు గుమ్మడి కాయ, టమాటా, ముల్లంగి వారు తీసుకొనే ఆహారంలో వాడకూడదు, అలాగే వారి తల మీద కూడా ఎక్కువగా తేమని ఉంచుకోవడం కూడా మంచిది కాదు. మొలలు ఉన్నవారు గుడ్లు మరియు మాంసం తినకూడదు. నెయ్యిని రాగి పాత్రలో ఉంచి తినకూడదు.

మనలో చాలామందికి పొద్దున్నే లేచి బెడ్ కాఫీ తాగడం అలవాటు కానీ అది అంత మంచిది కాదు, ఒకవేళ మీరు తాగాలనుకుంటే గోరువెచ్చని నీళ్లు తాగిన తర్వాత బెడ్ కాఫీ, టీ తాగవచ్చు. మీరు అల్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు అయితే కారం, మసాలాలు ఎక్కువగా తినకూడదు. మీకు చర్మ రోగాలు ఉన్నట్లయితే పొట్లకాయలు, ఎండు చేపలు, శనగలు, బీన్స్ ఎక్కువగా తినకూడదు. నువ్వుల నూనె ను ఉపయోగించి గోధుమలతో వండినటువంటి ఏ పదార్థాన్ని కూడా తినకూడదు. మీరు మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నట్లు అయితే మాంసం మరియు గుడ్లతో చేసిన వంటకాలు తినకూడదు. కావున ఇవన్నీ ఆహారంలో ఉన్నాయో లేదో చూసుకొని మీ ఆరోగ్యాన్ని బట్టి తీసుకోండి. ఆరోగ్యమే మహా భాగ్యం అని మన పెద్దలు ఊరికే చేప్పలేదు.