ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్య మంత్రికి కూడా ముచ్చెమటలే, మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది

రోహిణి సింధూరి ఈ పేరు కర్ణాటకలో ఓ సంచలనం. మోస్ట్ సిన్సియర్ IAS ఆఫీసర్ గా కర్ణాటకలో ఆమె పేరు తెచ్చుకున్నారు, రూల్ ఇస్ రూల్ ,రూల్ ఫర్ ఆల్ అనే సూక్తిని రోహిణి కచ్చితంగా ఫాలో అవుతారు. రోహిణి కలెక్టర్ గా లేదా డిపార్ట్మెంట్ గా గాని, ఉన్నత అధికారిగా గాని ఉన్నారంటే,

ఆ ప్రాంతంలోని రాజకీయ నాయకులకు హడల్, కిందిస్థాయి అవినీతిపరులకు బద్ధకస్తుల ఉద్యోగులకు చలి జ్వరం,అంతలా తన పనితనంతో దూసుకుపోతున్నారు ఆమె. అంతెందుకు గత ఏడాది మైసూర్ డిప్యూటీ కమిషనర్ గా ఉన్న రోహిణి బదిలీ చేస్తే ఏకంగా నగరం ఏకమై పోయింది,

యువత రోడ్లమీదకు వచ్చి బ్రింగ్ బ్యాక్ రోహిణి అంటూ దాదాపు లక్షల మంది సంతకాలు చేశారు, రోహిణిని బదిలీ చేయవద్దని ఆన్లైన్లో జనం హంగామా చేశారు. తన పనిరుతీరుతో అంతగా మంచి పేరును తెచ్చుకున్న రోహిణి మన తెలుగు బిడ్డనే. రోహిణి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్ష పల్లి లో దాసరి జైపాల్ రెడ్డి శ్రీలక్ష్మీ దంపతులకు పుట్టారు ఆమె. జైపాల్ రెడ్డి హైదరాబాదులోనే లాయర్గా ప్రాక్టీస్ చేయడంతో రోహిణి చదువు మొత్తం ఇక్కడే సాగింది. రోహిణికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నారు రోహిణి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత యూఎస్ కి పంపాలని తల్లి కోరుకున్నారు. ఆమె బంధువులు యూఎస్ వెళ్లడంతో రోహిణి కూడా పంపించాలని అనుకున్నారు కానీ రోహిణికి విదేశాలకు వెళ్లడం ఇష్టం లేదు.

పోనీ పీజీ చదివిద్దాం అనుకున్నా కూడా తల్లిదండ్రులు భయపడ్డారట ఎందుకంటే అందంగా ఉండే రోహిణి కుర్రాళ్ళు ఏడిపించేవారు ఆకతాయి కుర్రాళ్ళ గోల భరించలేక కాలేజీలు కూడా మాన్పించారు తల్లిదండ్రులు. అయితే ఆమె తల్లిదండ్రులు 1995లో సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సమయంలో తాను కలెక్టర్ అవుతాను అప్పుడు ఇక్కడే ఉండవచ్చు అని నవ్వుతూ రోహిణి చెప్పింది, కానీ తల్లి ప్రోత్సాహంతో సీరియస్ గా సివిల్స్ కి ప్రిపేర్ అయ్యారు రోహిణి. ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్ లోనే శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి మెయిల్స్ కోసం వెళ్లిన సమయంలో కారు ప్రమాదానికి గురయ్యారు రోహిణి. అయినా సరే కష్టపడి చదివి 2009లో సివిల్స్ సాధించారు ఆమె దేశవ్యాప్తంగా 49వ ర్యాంక్ సాధించారు కర్ణాటక క్యాడర్కు ఎంపికైన రోహిణి మొదటి పోస్టింగ్ తుముకూరులో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేశారు. 2011 నుండి 2012 వరకు అక్కడే పనిచేసి, ఆ తర్వాత తుమ్ముకూరు అర్బన్ డెవలప్మెంట్ కమిషనర్ గా పనిచేశారు.

అక్కడినుండి స్టేట్ డైరెక్టర్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పంచాయితీ రాజ్ మరియు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ శాఖలకు పనిచేశారు. అయితే నాటి నుండే రోహిణి తన పనితీరును ప్రపంచానికి చూపించారు, రూల్ బుక్ మాత్రమే ఆమెకు భగవద్గీత ఎమ్మెల్యేను ఎంపీను లేదంటే మంత్రి చెప్పాడును మాత్రం చేయరు, ప్రభుత్వ స్కీం అయితే పాలసీ బుక్ ముందు పెట్టుకుని తూచా తప్పకుండా నిబంధనలను ఫాలో అయ్యేలా చూస్తారు అంతేకానీ అధికారుల పార్టీ నేతలు చెప్పారని తప్పుడు మార్గంలో వెళ్లరు, అయినా సరే వెళ్తాము అంటే తొక్క తీసి పక్కన పడేస్తాము అనే టైపు రోహిణిది. ఆమె మాండ్య జిల్లా పంచాయతీరాజ్ చీఫ్ ఎగ్జిక్యూట్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు స్వచ్ఛభారత్ స్కీంను పరుగులు పెట్టించారు అంతేకాదు జిల్లాలో రికార్డు స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించి కేంద్రం నుండి ప్రశంసలను అందుకున్నారు. స్వచ్ఛభారత్ లో జిల్లాను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దారు,

మాండ్య జిల్లాలో తాగునీటి కోసం కేంద్రం 65 కోట్లు కేటాయిస్తే వాటిని సక్రమంగా వాడి నీటి వసతిని కల్పించారు రోహిణి గారు, అందుకు ఆమెను మెచ్చుకున్న కేంద్రం మరో ఆరు కోట్లను కేటాయించి మరింత సేవ చేయాలని సూచించారు, ఇది రోహిణి పనితనంలో వన్ సైడ్ మాత్రమే. కానీ రాజకీయ నాయకులు ఫైల్స్ పట్టుకొస్తే మాత్రం రూల్స్ చెబుతారు ఆమె రిక్వస్టులు, లంచాలు, మంత్రులు చెప్పారు అంటే మాత్రం అసలు నడవదు, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన రూల్స్ మాత్రమే పాటిస్తారు. ఎలాంటి రికమండేషన్ కి ఆస్కారం ఇచ్చేవారు కాదు దీంతో జిల్లాలోని నాటి అధికార పార్టీ నేతలు రోహిణినీ బదిలీంచేందుకు చెమటలు కక్కారు ,కానీ అయ్యే IAS ఆఫీసర్ బదిలీ అయితే అలాంటి పవర్ఫుల్ పోస్ట్ కి వెళ్తారు.