ఈ చిట్కా కేవలం నిమిషాల్లో పసుపుపచ్చగా ఉన్న దంతాలను ముత్యాల లాగా మెరిసేలా చేస్తుంది .

మీరు కనుక పళ్ళు పసుపుపచ్చగా లేదా గార పట్టి ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కా ట్రై చేయండి .ఈ చిట్కాకి కావలసిన పదార్దాలు లవంగాలు ,సాల్ట్,టూత్పేస్ట్,వెల్లుల్లి రెబ్బలు పళ్ళు పసుపు పచ్చగా మారాయి అంటే అర్ధం పళ్ళు పడవడానికి రెడీగా ఉన్నాయని అర్ధం .పసుపు ధనం బ్యాక్టీరియా గారలాగా పట్టేస్తుంది .ఈ బ్యాక్టీరియా కొద్దికొద్దిగా దంతాలను పాడు చేస్తుంది .అందుకే పసుపు పచ్చదనం లేదా గారను వదిలించుకోవడం చాలా ముఖ్యం .ఈ సమస్యను తగ్గించడానికి లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి .

లవంగాలలో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి .లవంగాలు దంతాలపై వచ్చే ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా పసుపు పచ్చదనం గార అయిన పోగొడతాయి . పసుపు పచ్చగా మరీనా దంతాలు కూడా తెల్లగా మెరిసిపోతాయి .లవంగాలను గ్రైండ్ చేసుకోవాలి మెత్త పొడిలా కాకుండా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి .ఇలా గరుకుగా పొడి చేసుకోవడం వల్ల బ్రష్ చేసేటప్పుడు దంతాలపై స్క్రబ్బర్లా పనిచేస్తుంది . ఒక గిన్నెలో అర చెంచా లవంగాల పొడిని తీసుకుని దానిలో రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి .
వెల్లుల్లి పసుపు పచ్చధనం ,గార పోగొట్టడమే కాకుండా పళ్లపై ఉండే బాక్టీరియా ,ఇన్ఫెక్షన్ నివారిస్తుంది . ఈ గిన్నెలో ఒక అర చెంచా ఉప్పు వేసుకోవాలి .ఉప్పు దంతాలను శుభ్రం చేయడమే కాకుండా బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది .తర్వాత ఇందులో రెండు చెంచాల టూత్పేస్ట్ కలుపుకోవాలి . ఇంట్లో రోజు వాడే టూత్పేస్ట్వేసుకోవచ్చు .దీన్ని మొత్తం కలిసేలా ఒక చెంచా సాయంతో కలుపుకోవాలి .ఈ మిశ్రమాన్ని చేసుకుని 2,3రోజుల వరకు వాడుకోవచ్చు .ఈ మిశ్రమాన్ని బ్రష్ కి కొంచెం పెట్టుకుని 2నిముషాల పాటు బ్రష్ చేయడం వలన పసుపు పచ్చదనమే కాకుండా ఎప్పటి నుండో పళ్ళపై పేరుకుపోయిన గారను కూడా పోగొడుతుంది .

నల్లగా పుచ్చుపోయిన పళ్లను ఇలా తోమడం వలన పళ్లు పాడవడం తగ్గుతుంది .ఈ మిశ్రమం పసుపు పచ్చగా మారిన పళ్ళను సైతం తెల్లగా ముత్యంలాగా మెరిసేటట్లు చేస్తుంది .రంగు మీరినా మారిన పళ్లనే కాకుండా పడవబోతున్న పళ్ళను బాక్టీరియా నుండి రక్షిస్తుంది .వీటిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పళ్ళను ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది .చిన్నపిల్లలకు పళ్ళు పాడవుతూ ఉంటే కనుక ఈ చిట్కా బాగా పనిచేస్తుంది .పళ్ళు పాడవకుండా బాక్టీరియా నుండి ఇన్ఫెక్షన్ రాకుండా సహాయపడుతుంది .