ఈ చెట్టు వున్న ఇంట్లో లక్ష్మీదేవి…

మన భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను పవిత్రంగా భావిస్తారు. అలాంటి వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేసి దైవ సమానంగా భావిస్తారు, ఇలాంటి వృక్షాలలో ఎంతో ముఖ్యమైనది మారేడు చెట్టు. దానిని బిల్వ వృక్షం అని కూడా అంటారు.

హిందువులు మారేడు వృక్షాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు అంతేకాకుండా ఈ మారేడు చెట్టు అంటే పరమశివుడికి ఎంతో ప్రీతికరం. మారేడు ఆకులు మూడు ఆకులు కలిపి ఒకే ఈనెలో ఉంటాయి,ఇవి ఆ పరమశివుడి మూడు కన్నులను సూచిస్తాయి.

మరి అంతటి పవిత్రమైన మారేడు చెట్టు మన ఇంట్లో పెంచుకుంటే ఏం జరుగుతుంది ?అసలు బిల్వపత్రం చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా? ఇలాంటి సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ చెట్టు కిందనే ఆ పరమశివుడు నివాసం ఉన్నాడని భావిస్తారు. అదేవిధంగా ఈ మారేడు చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది సాధారణంగా వృక్షాలు పూలు పూసి కాయలు కాస్తే మారేడు మాత్రం పువ్వు లేకుండా కాయలు కాస్తుంది. సాధారణంగా మనం ఏదైనా పుష్పాలతో పూజ చేసినప్పుడు తొడిమ లేకుండా పూజ చేస్తాం కానీ మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు కచ్చితంగా తొడిమలు ఉండాలి, మారేడు దళానికి ఉన్న ఈనే తాకినప్పుడు మన ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ మారేడు చెట్టు ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి.

అయితే ఎలాంటి సందేహం లేకుండా మారేడు చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. అయితే మారేడు దళాలను పోసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి, మారేడు చెట్టు ఆకులను బుధ, శని వారాలలో మాత్రమే కోయాలి, అమావాస్య ,పౌర్ణమి, సోమవారం, మంగళవారం ,సంక్రాంతి, శివరాత్రి వంటి పండగ రోజుల లో కూడా మారేడు దళాలను కోయకూడదు. అందుకే ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరచుకోవాలి, ఈరోజు అర్చన చేసిన మారేడు దళాలను మరుసటి రోజు కడిగి స్వామివారికి అర్చన చేయవచ్చు. ఎంతో పవిత్రమైన మారేడు చెట్టుకు ప్రదక్షణ చేస్తే మూడు కోట్ల దేవతలకు ప్రదక్షణ చేసిన పుణ్యం లభిస్తుంది. బిల్వ ఆకులతో పూజ శ్రేష్టమైనది అంతేకాదు ఈ బిల్వపత్ర వృక్షాన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి. బిల్వపత్రాలు గాలిని నీటిని శుభ్రపరుస్తాయి ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

జబ్బులు అంటవు, అంతర కణాలకు మంచిది , మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది బిల్వపత్రాలను నూరి రసం తీసి శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు. మారేడు వేరు రసం తీసి తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గిపోతాయి, ఈ రసాన్ని రోజూ సేవిస్తే అనారోగ్యాలు దరి చేరవు, బిల్వపత్రాలను దంచి కళ్ళపై లేపనంగా వేసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. బిల్వ చూర్ణం అతిసారాన్ని తగ్గిస్తుంది, ఇక పవిత్ర వృక్షాలలో ఒకటి శివునికి ప్రీతికరమైన ఈ మారేడు ఆకులతో శివ పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి మారేడు దళం మూడు భాగాలలో త్రిమూర్తులైన బ్రహ్మ ,విష్ణు, శివుడు కొలువుంటారు. మారేడుదలo విద్యాశక్తి ,జ్ఞాన శక్తి, కి సంకేతం ఇది శివ స్వరూపం.

శివ సహోదరి అయిన మహాలక్ష్మి దేవి హృదయం నుండి మారేడు దళం ఆవిర్భవించింది అందువల్లే శివుడికి ఆ దళం ఎంతో ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి. మారేడు దళం చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేసి ఆ చెట్టును తాకినట్లయితే శివుడిని స్మరించినట్లే అని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా రోహిణి నక్షత్రo రోజున మారేడు చెట్టుకి పూజ చేస్తే దారిద్య బాధలు తొలగిపోతాయి, సూర్యోదయం నుండి వచ్చే రోహిణి నక్షత్రం రోజు మారేడు చెట్టుకు పూజ చేస్తే సిరిసంపదలు వెల్లువిరుస్తాయి. రోహిణి నక్షత్రం చంద్రుడికి చెందింది ఆదిపత్యం వహించే దైవం శ్రీ మహా లక్ష్మి అందుకే రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు వద్ద పూజ చేస్తే ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది.