ఈ టిఫిన్ తినకండి. మీకు చేతులెత్తి పమస్కరిస్తున్నా

శరీరంలో అనేక రోగాల నుండి, అధికబరువు సమస్య నుండి బయటపడడానికి మనం ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది ఎప్పుడూ పెద్ద సమస్యే. ముఖ్యంగా మన ఉదయం లేచిన వెంటనే రెండు గ్లాసుల నీటిని తాగాలి. మధ్యలో ఒక గంట విరామం ఇచ్చి మళ్లీ రెండు గ్లాసుల నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో పేరుకున్న విషపదార్థాలను బయటకు పంపించి వేస్తుంది. తరువాత ఏవైనా కూరగాయల జ్యూస్ తాగాలి.

దీనికోసం మనం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు జ్యూస్ లేదా పాలకూర, మునగాకు జ్యూస్, మునగాకు , కరివేపాకు జ్యూస్ వంటి వాటిలో ఏదో ఒకటి తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా జ్యూస్లో పుదీనా ఎక్కువ ఉండాలి.

అలాగే పాలకూర, మునగాకు జ్యూస్ లో పాలకూర ఎక్కువ ఉండాలి. మునగాకు, కరివేపాకు జ్యూస్ లో కరివేపాకు తక్కువ మునగాకు ఎక్కువ ఉండాలి. వీటిలో కావాలంటే లేత బీరకాయ, సొరకాయ, గుమ్మడి కాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలను చేర్చవచ్చు. ఈ జ్యూస్లను ఉదయం టిఫిన్ తీసుకునేటప్పుడు ఒకటి, సాయంత్రం నాలుగు గంటలకు ఒకసారి తీసుకోవడంవలన మైక్రో న్యూట్రియంట్స్, లవణాలు పుష్కలంగా లభిస్తాయి. టిఫిన్ కోసం నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోకుండా ఇంట్లో చేసిన ఇడ్లీ, ఉప్మాలాంటివి తీసుకోవచ్చు. కానీ ఇడ్లీలు పొట్టు మినప్పప్పుతో చేసినవి మాత్రమే తీసుకోండి. గుండు మినప్పప్పుతో చేసినవి తీసుకోవద్దు.

ఇవి ఎన్ని రోజులైనా పురుగు పట్టవు. పురుగు పట్టలేదంటే అవి మంచిది కాదని అర్థం. మధ్యాహ్నం ఆహారంలో 50% కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఒక గంట విరామం ఇచ్చి ప్రతి గంటకు ఒక గ్లాసు చొప్పున నీటిని తాగుతూ ఉండాలి. నాలుగు గంటలకు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లేదా కూరగాయల జ్యూస్ తాగవచ్చు. తర్వాత రెండు గంటలు విరామం ఇచ్చి రాత్రి ఆహారాన్ని భుజించాలి. రాత్రి ఆహారంగా కేవలం పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఇలా పండ్లను రాత్రి ఆహారంగా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. కడుపునిండా తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.