ప్రకృతి ప్రసాదించే ఒక చక్కటి పండు కమలా పండు. దీనిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల కమలాలు తీసుకుంటే 30 గ్రాములు విటమిన్ C ఉంటుంది. దీనివల్ల శరీరానికి రక్షణ మరియు పోషకాలు లభిస్తాయి. ఈ కమలంలో ఉండే పోషక విలువలు 100 గ్రాముల కమలాలు తీసుకుంటే 87 గ్రాములు నీరు ఉంటుంది. కమలాల్లో ప్రోటీన్ జీరో, కొవ్వు జీరో, తక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ శక్తి ఉంటాయి. కాబట్టి ఇది చాలా తేలిగ్గా అరుగుతుంది. కమలాల్లో విటమిన్ సి తో పాటు సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఈ సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో స్టోన్స్ రాకుండా నిరోధిస్తుంది.
మనం తీసుకున్న ఆహారంలో ఉన్న ఐరన్ కంటెంట్ పేగుల్లోంచి రక్తంలోకి వెళ్లాలంటే విటమిన్ C చాలా అవసరం. కమలల్లో ఒక ముఖ్యమైన వాస్తవం ఉంది అని సైంటిఫిక్ గా నిరూపించబడింది. ట్రిప్టోఫెన్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఇది బాడీలో మెల్లటోనిన్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. మెల్లటోనిన్ అనేది నిద్రను బాగా రప్పించే హార్మోన్. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే ట్రిప్టోఫెన్ ఎక్కువగా ఉండాలి. ఈ ట్రిప్టోఫెన్ అనేది కమలాల్లో పుష్కలంగా ఉంటుంది. అందుకని ఈవినింగ్ టైంలో భోజనానికి ఒక గంట ముందు ఈ జ్యూస్ తాగితే సరిపోతుంది. కమలాలు లేని సీజన్ లో బత్తాయి జ్యూస్ తాగిన సరిపోతుంది.
కమలాల్లో లిగ్నిన్ మరియు పెక్టిన్ అనే ఫైబర్స్ ఉండడం వల్ల ప్రేగుల్లో బాగా కదలికలకు బాగా తోడ్పడుతుంది. దీనివల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది. వీటిలో ముఖ్యంగా హెస్పిరిడిన్, యాంథోసైనోనిన్ అనే రెండు కెమికల్స్ ఉంటాయి. ఇవి రక్తంలోకి చెక్కరను చేరకుండా నిరోధిస్తాయి. కాబట్టి డయాబెటిక్ ఉన్నవారు కూడా దీనిని తాగొచ్చు. ఈ రెండు కెమికల్స్ వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కమలాలు తింటే జలుబు చేసింది అంటే దోషం దానిలో కంటే మనం చేసే కొన్ని తప్పుల్లో ఉంటుంది. ఈ జ్యూస్ లో పంచదార కలపకూడదు. ఇలా చేస్తే జలుబు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంచదార కాకుండా తేనె ను కలుపుకొని కమలా జ్యూస్ తాగితే చాలా మంచిది. కమలాలను ఫ్రిజ్లో పెడితే ఆ చల్లదనానికి కూడా జలుబు చేస్తుంది. దీనిలో హై ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకం ఉన్న వారికి కూడా ఫ్రీ మోషన్ అవుతుంది.