ఈ పక్షి ఇంట్లోకి వస్తే సాక్షాత్తు లక్ష్మిదేవి అనుగ్రహం మీకు కలిగినట్లే….

ఈ పక్షి ఇంట్లోకి వస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగినట్లే అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. కాకి మీకు ఎదురొస్తే జరగబోయేది ఏంటిదో తెలిస్తే షాక్ అవుతారు, మరి మన ఇంట్లోకి ఏ పక్షి వస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. సాధారణంగా గబ్బిలాలను అత్యంత చెడు జీవులుగా పరిగణిస్తారు, కొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇంట్లో గబ్బిలాల రాకను అశుభంగా విశ్వసిస్తారు. అయితే ఇది పగటిపూట కనిపించదు కేవలం రాత్రిపూట మాత్రమే ఇంటికి వస్తుంది,

ఇలా రావడం వల్ల ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని ,జీవితంలో ఇబ్బందులు ప్రారంభమవుతాయని భావిస్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని, ఇది దెయ్యాల మాదిరిగా తలకిందులుగా వేలాడుతుందని రకరకాలుగా ఇప్పటివరకు మనం ఎన్నో విన్నాం. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది అసలు గబ్బిలాలు ఇంట్లోకి రావడం చాలా శుభసూచకం అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అదేంటి అందరూ గబ్బిలాలను ఇంటికి ఇంట్లోకి వస్తే అశుభం అంటూ ఉంటే వీళ్లేంటి ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా?

నిజమేనండి గబ్బిలం అమ్మవారు మన ఇంట్లోకి రాబోతుంది ,మన ఇంట్లో ఆకస్మిక ధన లాభం కలగబోతుంది అని అర్థం. ఆర్థికంగా పురోగతిని సాధించడానికి గబ్బిలాలు అనేది ఇంట్లోకి వస్తున్నాయి అనేది సంకేతంగా చెబుతున్నారు, కాబట్టి ఎవరి ఇంట్లోకి గబ్బిలం వచ్చినా సరే ఎవరూ కూడా భయపడిపోకండి, అయితే గబ్బిలం ఇంట్లోకి రావడం మంచిదే అని చెప్పినా సరే చాలామంది మాత్రం దాన్ని తప్పుగానే భావిస్తారు. అయితే ఇలా భావించే వారికి ఒక పరిహారం ఉంది ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న వారిలో ఒక ఐదుగురు ఒకచోట కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకోండి అప్పుడు మీకు ఏదైనా దోషాలు ఉన్నాయి అనిపిస్తే పోతాయి,నమ్మినవారు అయినా సరే చదువుకున్న ఇంకా మంచే జరుగుతుంది.

ఇంట్లో కిటికీల నుండి ఇంట్లోకి పక్షి ఎగిరితే అది ఇంట్లోకి దురదృష్టం తీసుకొస్తుంది అనే అపోహ ఉంది. అంతేకాదు మరణానికి సంకేతం అని కూడా భావిస్తారు మరి కొంతమంది కాకి తలుపులో నుండి ఇంట్లోకి వస్తే ఇల్లు వదిలి పెట్టాలని అంటారు, తేనెటీగలను దేవదూత అని నమ్ముతారు అందుకే ఇంట్లో తేనే తీగలు ఉంటే కుటుంబంలో ఎవరో ఒకరి మరణానికి సంకేతం అని అర్థం. ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడు ఇంట్లోనే ఉండేది కానీ ప్రస్తుతం కాలంలో అది కనిపించడం లేదు అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు. ఎందుకంటే రామచిలుకకు కుబేరునికి సంబంధం ఉంది ఇది శుభానికి ప్రతీక. రామచిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపదలో లాభం, వ్యాపారంలో వృద్ధిని సూచిస్తుంది, వసూళ్లు కానీ రుణాలు కూడా వసూల్ అవుతాయి. ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది, తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొస్తుంది.