ఈ పనితో అఖండ రాజయోగం మీ సొంతం

పాదరస శివలింగానికి ఏ విధంగా పూజ చేస్తే ఎలా అభిషేకం చేస్తే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుందో, లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివలింగాలలో అదేక రకాలైన శివలింగాలు ఉంటాయి అయితే శివలింగాలలో పాదరస శివలింగానికి స్పటిక శివలింగానికి చాలా ప్రత్యేకత ఉంది. స్పటిక శివలింగం ఇంట్లో ఉంచుకొని అభిషేకం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది.

పాదరస శివలింగం ఇంట్లో ఉంచుకొని అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని సంప్రదాయంలో చెప్పారు. పాదరస శివలింగానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పరమేశ్వరుడు ఆనందతాండవం చేసేటప్పుడు పరమేశ్వరుడు యొక్క వీర్యము ఆయన పాదాల నుండి జారీ భూమి మీద పడింది దాని నుండే పాదరసం వచ్చిందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి పాదరసం అంటే రుద్ర వీర్యానికి సంకేతం. కాబట్టి పాదరస శివలింగం అంటే శివ వీర్యానికి సంకేతం అని మనకు రహస్యంగా శివ మహాపురాణంలో చెప్తారు అందుకే ఇంట్లో పాదరస శివలింగం ఉంచుకొని ప్రత్యేకంగా పూజ చేస్తే కాళ్ళ అందెలు ఘల్లు ఘల్లు మని లక్ష్మీదేవి ఆనందతాండవం చేస్తుంది.

అయితే పాదరస శివలింగం రుద్రవీర్యం నుండి అవతరించింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అశుచిగా పాదరస శివ లింగాన్ని తాకకూడదు. బయట నుండి వచ్చినప్పుడు ఆ వస్త్రాలతో పాదరస శివలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు,శుచి, శుభ్రత లేకుండా తాగకూడదు. పాదరస శివలింగానికి ఎవరైనా సరే సూర్యోదయానికి ముందే అభిషేకం చేసి ఆ తరువాత పాదరస శివలింగం మొత్తం విభూతిలో కప్పి ఉంచినట్లయితే ఆ ఇంట్లో మని లక్ష్మీదేవి ఆనందతాండవం ఘల్లు ఘల్లు మనీ చేస్తుంది. అలాగే సహజంగా శివలింగం ఇంట్లో ఉంచుకునేవారు పానవట్టం ఏర్పాటు చేస్తారు ఏదైనా లోహంతో పానవట్టం ఏర్పాటు చేస్తారు కానీ పాదరస శివలింగం ఇంట్లో ఉంచుకున్న వారు లోహంతో పానవట్టం ఏర్పాటు చేయకుండా అద్దంతో పానవట్టం ఏర్పాటు చేస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది.

కొవ్వత్తి స్టాండ్ ఉంటుంది కదా ఆ కొవ్వొత్తి స్టాండ్ లాంటి దానిలో పాదరస శివలింగం ఉంచుకుంటే అద్భుతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంటే అద్దంతో తయారు చేయబడినటువంటి పానవట్టాన్ని మనం ఉపయోగించాలి అంతేకానీ లోహంతో తయారుచేసిన పాదరస శివలింగానికి ఉపయోగిస్తే తక్కువ ఫలితం ఉంటుంది, అద్దంతో తయారు చేయబడిన పానవట్టం పెడితే విశేషంగా లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తుంది. అలాగే పాదరస శివలింగం ఇంట్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎవరైనా సరే ఎండిపోయిన మారేడు దళాలతో కనుక పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి ఘల్లు ఘల్లుమని నాట్యం చేస్తుందని మంత్రశాస్త్రంలో రహస్యంగా చెప్పారు.

అందరూ ఏం చేస్తారు అంటే మారేడు దళాలతో శివలింగానికి పూజ చేస్తారు కానీ పాదరస శివలింగం ఇంట్లో ఉన్నవారు ఎండిపోయిన మారేడు దళాలను శివలింగానికి పెట్టండి ఇది చాలా రహస్యమైన విషయం ఎండిపోయిన మారేడు దళాలు పాదరస శివలింగానికి పెడితే విశేషంగా ధనప్రాప్తి కలుగుతుందని మంత్ర శాస్త్రంలో రహస్యంగా చెబుతారు. అలాగే పాదరస శివలింగం ఇంట్లో ఉన్నవారు ముందు పంచామృతాలను పోసి ఆ తర్వాత నీళ్లు పోసి అభిషేకం చేసుకొని ఆ తర్వాత పాదరస శివలింగం దగ్గర గరక ఉంచండి. ఇలా గరకపోచలు పాదరస శివలింగం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే విశేషంగా లక్ష్మి కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఎప్పుడైనా సరే ఇంట్లో పాదరస శివలింగం ఉంచుకున్న వారు ఒక మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు అప్పుల బాధల తీవ్రతలను తగ్గింప చేసుకోవచ్చు మొండి బాకీల సమస్యల నుండి బయటపడవచ్చు. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే” శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః”ఇది మంత్రం.