ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే మీరు చాలా అదృష్టవంతులు…ఎందుకో తెలిస్తే

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ దాదాపుగా పారిజాతం మొక్కను ఇంటిలో పెంచుకుంటున్నారు. పారిజాతం పూలను దేవుని పూజకు వాడుతూ ఉంటారు. పారిజాతం ఆకు,పువ్వు,వేరు,కాండం ఇలా ఈ మొక్కలో అన్నీ బాగాలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉప యోగిస్తారు. రెండు పారిజాతం ఆకులను తీసుకొని శుభ్రంగా కడగాలి.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కడిగిన పారిజాతం ఆకులను ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మూడు నిమిషాల పాటు మరిగిస్తే ఆ ఆకులోని పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి ఉదయం సమయంలో తాగాలి. ఈ విధంగా తాగటం వలన కండరాల నొప్పులు, కండరాల తిమ్మిరి, మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి.

అలాగే ఈ నీటిని తాగటం వలన డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే అజీర్ణం,గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ నీటిని తాగటానికి అరగంట ముందు ఏమి తీసుకోకుండా ఉంటే మంచిది. పారిజాతం ఆకులు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. పారిజాతం ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఆ పొడిని కూడా వాడవచ్చు.