ఈ 4 రాశులకు గోల్డెన్ లెగ్…

సాధారణంగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు, ఎంతో విశేషమైన పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుని పూజిస్తారు అయితే కొన్ని రాశుల వారికి శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది.

ఆ రాశుల వారు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులలో కొన్ని రాశుల వారికి శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రమైనవి అని చెప్తారు. శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో అష్టమి తిధి రోజు రోహిణి నక్షత్రంలో వసుదేవ దేవకిల కి శ్రీకృష్ణుడు 8వ అవతారంగా జన్మించాడు.

అదృష్టాన్ని పొందబోతున్నటువంటి మొదటి రాశి వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి జాతకులకు జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం వృషభ శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన రాశిగా చెప్పబడింది. శ్రీకృష్ణుడు యొక్క అనుగ్రహంతో ఈ రాశి వారు చేసే కార్యాలన్నిటిలోనూ ఎన్నో విజయాలను సాధిస్తారు కావున ఈ రాశి వారు నిత్యం శ్రీకృష్ణుని స్మరించుకోవాలని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి రేపు వచ్చేటటువంటి రోజులన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహంతో వీరి యొక్క జాతకంలో ఉన్నతమైనటువంటి వెలుగులు ఉన్నతమైనటువంటి రోజులు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. కష్టపడి పని చేసి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటారు అనేక రంగాలలో కూడా మీ దృష్టిని ఆకర్షిస్తారు.

ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్టం ప్రతి కార్యంలో కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి పోటీ పరీక్షలకు కూడా ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇది మంచి అవకాశం గా ఉంటుంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణుడు కర్కాటక రాశిలో కూడా తమ దయను చూపిస్తాడు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు అన్ని కార్యక్రమాలలో కూడా ఎన్నో విజయాలను సాధిస్తారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడికి ప్రత్యేక అనుగ్రహం ఉన్నవారు మరణాంతరం కూడా మోక్షాన్ని పొందుతారని చెబుతారు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు చాలా కాలంగా రానటువంటి అదృష్టం రేపు వచ్చేటటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి నుండి రాబోతుంది. వీరిలో భావోద్వేగము, పరిజ్ఞానము పెరుగుతుంది. వ్యాపారులు వారి యొక్క విదేశీ ప్రాజెక్టులు కెరీర్ లో కూడా పురోగతి ఉంటుంది, కష్టపడి పనిచేస్తారు, విద్య విషయంలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు బుధాదిత్య యోగం ఏర్పడబోతుంది రేపు వచ్చేటటువంటి రోజుల నుండి కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి, అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు.

తర్వాత రాశి సింహ రాశి వారు, ఈ రాశి వారికి కూడా శ్రీకృష్ణుడి యొక్క ప్రత్యేక అనుగ్రహం ఉండబోతుంది. ఈ రాశి వ్యక్తులు శ్రద్ధ గల జీవులు అంతేకాదు ఈ రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుందని చెబుతున్నారు, వీరు రాధాకృష్ణ లను ధ్యానించాల్సి ఉంటుంది. రేపటి నుండి కూడా ఉన్నతమైనటువంటి మార్గాలలో ఉన్నతమైన శిఖరాలను చేరుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి కెరియర్ లో కూడా మంచి అవకాశాలు వస్తాయి, పదవి ఇంట్లో కుజుడు ఉండడం వల్ల వీరికి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. వీరికి వాహనయోగం కూడా కలిగి ఉంది, ఉద్యోగం కార్యాలయంలో కూడా ప్రశంసించబడతారు, ఎన్నో సలహాలను, సంప్రదింపులను పొందుతారు. కుటుంబ పరంగా ఉన్నటువంటి ఒడిదుడుకులు కష్టనష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి, ముఖ్యంగా తెలివితేటలతో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. భార్యాభర్తల మధ్య పరస్పరం సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ రాశుల వారికి రేపటినుండి కూడా విపరీతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అదృష్టం పట్టబోతున్న చివరి రాశి తులా రాశి. ఈ తులా రాశి జాతకులకు కూడా శ్రీకృష్ణుడు యొక్క ప్రత్యేక అనుగ్రహం ఉండబోతుంది. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఈ జాతకులు జీవితంలో అన్ని విధాలుగా కూడా సుఖశాంతులను పొందుతారని ఎన్నో గౌరవ మర్యాదలు పొందుతారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎప్పుడు ఈ కృష్ణుని పూజించాలి, ఈ రాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు, కచ్చితంగా ఈ రాశి వారికి ఎన్నో అద్భుతమైన మార్పులను మీ కళ్ళతో మీరే చూస్తారు. అద్భుతమైన కళా రంగాలలో కూడా విస్తరిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు తులా రాశి వారికి చాలా కాలంగా లేనటువంటి అదృష్టాలు రాబోతున్నాయి జీవితంలో ఎన్నో విజయాలను కూడా సాధిస్తారు.