ఈ 4 సంకేతాలు మీకు కనిపిస్తే లక్ష్మీదేవి మీ తిష్టవేసుకుని కూర్చుంటుంది అర్ధం

ఈ సంకేతాలు మీకు కనిపించాయి అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టబోతుంది అని అర్థం. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంట్లో అడుగు పెడుతుందో ఎవరికీ తెలియదు, మరి అలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అంటే రాబోతుంది అనే విషయం మనం ఎలా గ్రహించగలుగుతాం ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం అనే విషయాలతో పాటుగా, లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా కొలువుండాలి అంటే ఏం చేయాలి?

మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్త్రాలు చెబుతున్నాయి, వీటిలో ముఖ్యమైనవి పసుపు, కుంకుమ , బంగారం , రత్నాలు,ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి ,ఇత్తడి కలశాలు, ఆవు పేడ, ఆవు కొమ్ముల మధ్య ,పూజా మందిరం ,పవిత్రమైన మనసు, దర్బలు ,మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణులు. శ్రీ సూక్తం లో లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏంటో వివరించే మంత్రాలు చాలా ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చేయాలని ఈ మంత్రాలకి భావం.

అయితే శ్రీమహాలక్ష్మి ఇంటికి వచ్చేముందు కొన్ని సంకేతాలు వస్తాయి ఈ సంకేతాలను పసిగడితే డబ్బు ఎప్పుడు మీతోనే ఉంటుంది. కోయిల కూత వినడానికి ఎంత వినసొంపుగా ఉంటుంది మనసుకి ప్రశాంతతను చేకూరుస్తుంది అంతేకాకుండా కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభసూచికంగా చెప్తారు, కోయిల కూసిన దిశగా శుభ అశుభాలుభాలు నిర్ణయిస్తారు. మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది.

కొంతమంది బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు, అయితే బల్లి వల్ల శుభ సూచికాలు కూడా ఉన్నాయి, అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతి పై పడితే త్వర త్వరగా పైకి ఎక్కడానికి ఆ సంకేతం పోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందబోతున్నారు అని తెలుసుకోవాలి. చీమలు ఇంట్లో ఉంటే చాలామందికి నచ్చదు ఎందుకంటే ఇల్లు మురికిగా ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తారు, అయితే ఇంట్లో నల్ల చీమలు ఉంటే మాత్రం శుభ సూచికంగా భావించవచ్చు , బియ్యం, ధాన్యాలను మోస్తున్న చీమలనీ శుభ సూచికంగా భావిస్తారు.

అక్షతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉంటాయి అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉండడం అంత మంచిది కాదు, ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీపై అప్పు భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దాన్ని చంపేంత వరకు నిద్రపోరు చాలామంది. అయితే పాము శుభ సూచకమని మీకు తెలుసా మీ ఇంట్లో ఎప్పుడైనా రెండు ముఖాల పాముని చూసినట్లయితే అది చాలా శుభసూచకంగా పరిగణించండి, అలా చూసిన వారి ఇంటికి వెళ్లడం కూడా చాలా పవిత్రంగా భావించవచ్చు, ఈ పాము విషపూరితము కాదు ఒకవేళ కనిపిస్తే అది బయటకు వెళ్లేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది.