ఈ 8 వస్తువులు పూజా మందిరంలో ఉండకూడదు వుంటే వెంటనే తీసేయండి!లేదా ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే..

మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో, మన గృహంలో ఉండే పూజా మందిరం కూడా అంతే ప్రధానమైనది. అయితే పూజా మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడి అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది. అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసిన ఎన్ని వ్రతాలు చేసిన ఎన్ని నోములు నోచిన, ఎంత ఉపవాసం చేసి భగవంతున్ని భక్తితో ఆరాధించిన, భగవంతుని అనుగ్రహం అనేది కలగదు.

ఎంత దేవుని ఆరాధించిన కోరికలు అనేవి తీరవు, అలా జరగడానికి కారణం మనం చేస్తే చిన్న చిన్న తప్పులే, మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్లిపోతాడు. పూజ మందిరంలోని దేవత శక్తి అంతా కూడా పోతుంది. ఎనిమిది వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజ గదిలో పెట్టకూడదని ప్రాచీన గ్రంథాలలో చెప్పారు. కానీ చాలామందికి తెలియక ఆ వస్తువులనే తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉన్నారు.

వందలో 99 మంది తెలియక ఈ తప్పు చేస్తూ ఉన్నారు. దాని వలన ఎన్ని పూజలు చేసిన ఫలితం రావట్లేదు. మరి ఇంతకీ పూజ గదిలో పెట్టకూడని ఆ ఎనిమిది వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటగా పూజ గదిలో దివంగతుల యొక్క చిత్రపటాలు అంటే, చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు. అంటే తాత నానమ్మ తల్లిదండ్రులు గాని చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు,

కానీ అది పెద్ద పొరపాటు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుల్లే కదా వాళ్ళు దేవుళ్ళతో సమానమే కదా, వారి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు, వాళ్లకు కూడా పూజ చేసేస్తే రెండు పనులు ఒకేసారి పూర్తి అయిపోతాయి కదా, అనుకుంటూ ఉంటారు కానీ, అది పెద్ద తప్పు. ఎందుకంటే పితృదేవతలు ఉన్నచోటకు దేవతలు రారు, దేవతలు ఉన్న చోటకి పితృదేవతలు రారు, అందుకే పితృ కార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు పనులు చేయరు.

ఇంటికి తోరణం కట్టరు ముగ్గు వేయరు ఇంట్లో గంట వాయించరు, దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది, దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు రారు,పితృ దేవతలు ఉన్న చోటకు దేవతలు రారు కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజగదిలో పెడితే, దేవతలు ఆ పూజ గదిలో ఉండరు వెళ్లిపోతారు. ఆ తర్వాత మనం ఎంతో పూజ చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి పితృదేవతల పటాలు పూజ మందిరంలో ఉంటే వెంటనే తీసేసి ఇంకొక చోట పెట్టుకోండి. పూజ గదిలో కేవలం దేవుడి పటాలు మాత్రమే పెట్టుకోండి. ఇక పూజ గదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటంటే, ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి మేకులు లాంటివి పూజ గదిలో పెట్టకూడదు.

కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి పీచు తీయడానికి సుత్తి కత్తి లాంటివి పూజ గదిలో పెడతారు కానీ అలా పెట్టకూడదు. ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి ఇనుప గజ్జల తల్లి అనే పేరు ఉంది, పూజ గదిలో ఎప్పుడూ కూడా ఇనుప వస్తువులను పెట్టకూడదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇనుప మేకులతో కూడా ఫోటోలను గోడలకు తగిలించకూడదు. ఇనుప మేకులకు బదులు రాగి లేదా ఇత్తడి మేకులు వాడితే మంచిది. మీరు ఆల్రెడీ ఫోటోలు తగిలిస్తే ఆ ఫోటోలను తీయడానికి వీలు లేకపోతే ఆ మేకులకు కొంచెం పసుపు రాయండి. మేకుకు పసుపు పెట్టడం ద్వారా ఆ దోషం పోతుంది.