ఎంతటి నర దిష్టి అయినా ఈ ఒక్క దెబ్బతో పోవాల్సిందే

నరదిష్టి అని అంటూ ఉంటారు కదా అసలు నరదిష్టి అంటే ఏమిటి ?అది వచ్చింది అని మనం ఎలా తెలుసుకోవాలి? అది వచ్చిన సూచనలు ఏమైనా ఉంటాయా? నరదిష్టి, నరదృష్టి అనే విషయాలను గురించి మాట్లాడితే ఒక మనిషి ఎదగడానికి పడిపోవడానికి మూల కారణం సాటి మనిషి ఇందులో ఎలాంటి మార్పు లేదు. మనం తెల్లవారులు లేస్తే కొంతమంది వ్యాపారస్తుల దగ్గర మనం చూస్తూ ఉంటాం గ్లాసులో రెండు నిమ్మకాయలు వేసి పసుపు వేసి పెడుతూఉంటారు, ఈ నిమ్మకాయ యొక్క ఉపయోగం ఏమిటంటే అది చెడును లాగేస్తుంది. మన పూర్వ కాలంలో మనం బయటకు వెళ్తున్నాo అంటే పెద్దవారు పెద్దవారు నిమ్మకాయలను తీసుకు వెళ్ళండి అంటారు. మనం ఎప్పుడైనా పొలిమేరలు దాటినప్పుడు నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే అది మన దగ్గరకు రానివ్వదు. అలాగే షాపుల్లో ఇలా పెట్టుకున్నప్పుడు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నిమ్మకాయ అనేది నెగిటివ్ ఎనర్జీ ని లాగేస్తుంది. ఇలా వేసిన నిమ్మకాయలను మర్నాడు డ్రైనేజీ లోనూ రోడ్డుపైన పడేస్తూ ఉంటారు.

ఆ రోడ్డు మీద పడేసిన నిమ్మకాయను కొన్ని పరిస్థితుల్లో కొంతమంది తొక్కుతూ వెళ్ళిపోతారు, దీని ప్రభావం వారికి ఎలా ఉంటుంది అంటే అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న జీవితంలో ఏదో తెలియని అలజడి ఉన్నట్లుండి ఒళ్ళంతా చెమటలు పట్టడం ,లేదా భయం వేయడం ,కూర్చున్నప్పుడు కాళ్ళు వణకడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి పనిలో కూడా రేపు పని ముగిస్తుంది అనే సమయంలో ఆటంకం రావడం జరుగుతూ ఉంటుంది, ఈ ఆటంకం ఎందువల్ల వస్తుంది అంటే దానికి కారణాలు ఉండవు, నరదిష్టి, నరదృష్టి అంటే అతడు చూసే చూపు మనం వింటూనే ఉంటాం నరదృష్టి కి నాపరాయి సైతం పగిలిపోతాయి అంటారు. వీటికి వేరే కారణాలు ఆలోచిస్తాo తప్ప అసలు ఈ నరదృష్టి ఎలా తగిలింది ఎలా వచ్చింది అనే విషయం తెలుసుకోలేము, ఇలా కాకుండా అసలు ఈమధ్య ఎలా వచ్చింది అనే విషయం మనం తెలుసుకోవాలి.

అంటే, బాదం కాయ తీసుకొని దాన్ని పగలగొట్టి జాగ్రత్తగా లోపల ఉన్న గింజను తీసుకొని రాగి బిల్లల మధ్యలో పైన ఒకటి కింద ఒకటి పెట్టినట్లయితే అది గిర్రున తిరుగుతుంది, ఇలా తిరిగి నట్లయితే వారికి అపారమైన నరదృష్టి ఉన్నట్టు తెలుసుకోవాలి, ఒకవేళ తిరగనట్లయితే అది అలాగే స్థిరంగా ఉంటుంది. ఈ నరదృష్టి తగలడానికి కారణం ఏమిటంటే ఎవరో నిన్ను చూసి ఏడుస్తున్నారు లేదా నీవు ఎవరికో అన్యాయం చేశావు ఆ అన్యాయం యొక్క ఉసురు నీకు తగులుతుంది జాగ్రత్తగా ఉండమని అర్థం. వీటి పరిష్కారానికి మంత్రాలు తంత్రాలు ఏమీ అవసరం లేదు, దీనికి ఒక బొట్టు ఉంటుంది అది ఏమిటంటే కస్తూరికాయ అని దొరుకుతూ ఉంటుంది తర్వాత అరటి డోప్పలు ఉంటాయి కదా ఈ రెండిటినీ తీసుకుని ఆవు నెయ్యి తీసుకుని బొగ్గులో ఈ అరటిపువ్వు డోప్ప మరియు కస్తూరి వేసి బాగా కాల్చాలి.

ఇలా కాల్చిన తర్వాత అందులో కొన్ని రకాల మూలికలతో తయారుచేసిన ఒక బొట్టు ఉంటుంది అందులో మారేడు రసం మరియు దానిమ్మ పువ్వు రసం, అందులో ఇలా ఏడు రకాల రసాలు ఉంటాయి వీటన్నిటిని కలిపి ఒక బొట్టు తయారు చేసి మనం బయటికి వెళ్లే ముందు మెడ దగ్గర పెట్టుకోవచ్చు లేదా ముఖంపై పెట్టుకోవచ్చు. ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి దీనిని మన ముఖంపై కనుక పెట్టినట్లయితే ఆకర్షణ శక్తి పెరుగుతుంది, బొట్టు పెట్టుకోవడం వల్ల వ్యాపారం చేసేటప్పుడు జనాల యొక్క ఆకర్షణ పెరుగుతుంది, అలాగే మన మీదకు ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ రాకుండా కాపాడుతుంది. ఈ బొట్టు ధరించడం వల్ల దీని నుండి చాలామంది బయట పడుతున్నారు. ఇంత పెద్ద నరదిష్టి ఒక బొట్టుతో పోతుందా అని అంటారు నమ్మకంతో చేస్తే తప్పకుండా పోతుంది. ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల అది బింబ ప్రతిబింబ లాగా అది మన చుట్టూ ఒక వైబ్రేషన్ లాగా ఒక వజ్ర కవచం లాగా పనిచేస్తుంది. అంతే ఒక అద్దంలో మనం చూసుకొని మనం ఏం చేస్తే అలా కనిపిస్తుందో ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అనేది మనమీద ఇటువంటి ప్రయోగాలు చేసిన ప్రయత్నం చేసిన రిఫ్లెక్షన్ తగులుతుంది.