ఏ బార్య అయినా, ఈ విషయాలు భర్తకు ఎప్పటికి చెప్పకూడదు

వివాహము అన్ని విషయాలలో కన్నా గొప్పది అన్న మాట చాలా ధర్మాలలో వినబడుతుంది.మనిషికి తన పరిణామ క్రమంలో ఒక నాగరికులుగా ఎదగడానికి, ఒక మంచి సమాజంగా ఏర్పడడానికి కుటుంబ వ్యవస్థ మాత్రమే కారణం,

అటువంటి కుటుంబ వ్యవస్థ అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది అంటే వివాహ వ్యవస్థ మాత్రమే కారణం.ముఖ్యంగా భారతీయ వివాహవ్యవస్థ వధూవరులను పెళ్లి నాటి నుండి ఒకరితో ఒకరు కలిసి పోయేలా ఏర్పాటు చేయబడింది. దీంతోపాటు వారిద్దరికీ పలు సూచనలు కూడా చేసింది.

భార్య లేదా భర్త ఎలా ఉండాలి, తన జీవిత భాగస్వామితో ఎలా మెలగాలి అంటూ భారతీయ ప్రాచీన గ్రంథాలలో ఎన్నో సూచనలు కనిపిస్తాయి, వీటి అంతరార్థం వారి మధ్య ప్రేమానురాగాలను పెంపొందించడం, తద్వారా మంచి కుటుంబ వ్యవస్థను నిలబెట్టడం.

అయితే భార్యా భర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు, ఎంత బాగున్నా భార్య విషయంలో మాత్రం ఆమె కొన్ని విషయాలను తన భర్త ఎప్పటికీ చెప్పలేదు. వీటిలో కొన్ని పాజిటివ్ ఉండొచ్చు, లేదా కొన్ని నెగిటివ్ ఉండొచ్చు, ఇటీవల కొన్ని సర్వేలలో తేలిన విషయాలు ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో, ముఖ్యంగా ఇండియా క్వార్టర్స్లో దీని గురించి తెలుసుకుందాం.

భారతీయ వివాహవ్యవస్థ ఎంత గొప్పది అంటే, ప్రాచీన భారతీయ సాహిత్యంలో భర్త ప్రాణాలు దక్కించుకోవడం కోసం, ప్రాణత్యాగం చేసిన స్త్రీ మూర్తులు ఎందరో కనిపిస్తారు. భర్త మాట ప్రకారం ఎన్ని కష్టాలు ఎదురైనా, భర్త మాటను గౌరవించడానికి, పాటించడానికి సుముఖత చూపిస్తున్న స్త్రీలు కనిపిస్తారు.

స్త్రీలలో ఇటువంటి అంకితభావం భారతీయ మూలాల లోనే ఉంది, ఈ క్రమంలో ఆమె భర్తకు చెప్పలేని లేదా ఇవ్వలేని కొన్ని విషయాలలో, మొదటిది తన వలన కలిగే నష్టం, రోజులో ఎంత మారుతున్న సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్న, మహిళలు అంతగా పురుషులలో సమానంగా ఉన్న, ఇప్పటికీ సాంప్రదాయాన్ని పాటించే మహిళలకు కొదవలేదు.

భర్తను అమితంగా ప్రేమించే స్త్రీలకు సంబంధించి, వారు భర్తకు చెప్పలేని ఆ ప్రత్యేకమైన విషయాలు ఏంటో చూద్దాం.తన మనసులో ఉన్న విషాద భావనను, భార్యలు సాధారణంగా భర్తకు చెప్పాలి అనుకోరు, తన బాధను అణుచుకోవడం తప్పించి, తన భర్తకు అనుకోరు, సాధ్యమైనంతవరకు బాధను దిగమింగడానికి చూస్తారు.

భార్య దాచిపెట్ట ఇంకో విషయం తన ఆరోగ్యం గురించి, భర్త మనశ్శాంతి చెడగొట్టే తన అనారోగ్యం విషయాన్ని ఆమె భర్తకు చెప్పదు, విషయం చేయి దాటి పోయేలా ఉంటే మాత్రమే తన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులకు చెబుతుంది. భర్త అమితంగా ప్రేమించే భార్య కూడా, తన మనసులో భర్త తప్పించి పరాయి పురుషుని కనీసం ఊహించను కూడా లేదు.

అయితే ఈ విషయాన్ని రుజువు చేసుకునేందుకు, తన భర్తకు పదేపదే చెప్పడం లాంటివి జరగదు, కేవలం పురుషులు మాత్రమే స్త్రీ అంతరంగాన్ని ఆలోచించి, అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. భార్య భర్త కు చెప్పండి లేదా దాచిపెట్టే మూడవ విషయం

తాను రహస్యంగా దాచిన ధనం గురించి, నిజానికి అలా చేయడం వెనుక ఉద్దేశం తన కుటుంబ బాగోగుల గురించి జాగ్రత్తపడటం, జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఊహించి, చేసే నివారణ చర్య ఇది ఎంతగా దాచిపెట్టిన చివరకు తన భర్త కోసం కుటుంబం కోసమే ఖర్చు చేస్తుంది, అయితే ఇలా రహస్యంగా డబ్బు దాచడం తరచూ ఇది భర్త అపార్థానికి కారణం అవుతుంది.

తన భార్య తనను అమితంగా ప్రేమిస్తుంది అని నమ్మే ప్రతి భర్తకు ఈ విషయాలలో పొరపాటున ఎప్పుడైనా అపార్థం కలగవచ్చు .కాస్త నిదానంగా ఆలోచించి తన భార్య అంతరంగాన్ని ఆలోచిస్తే తప్ప వాస్తవాలు బోధపడవు. ఈ సర్వేలో తేలిన విషయాలను బట్టి ఏ మంచి భార్య కూడా భర్తకు వ్యతిరేకంగా ఎటువంటి పనులు చేయలేదు అని అర్థం అవుతుంది, దీన్ని అర్థం చేసుకోవలసిన బాధ్యత ప్రతి భర్తది