అన్ని ఇంద్రియాలలోకి కళ్ళు అనేవి చాలా ప్రధానం, అందుకే సర్వేంద్రియానామ్ నయనం ప్రధానం అంటారు. అయితే అదృష్టవశాత్తు చాలామందిలో కంటి చూపు తగ్గిపోతుంది. ముఖ్యంగా పెద్ద వయసు అంటే పర్వాలేదు కానీ చిన్న వయసులోనే ఈ కంటి చూపు తగ్గుతుంది. ఇలాంటి అప్పుడు ఏం చేయాలి ఒక చక్కటి ఆహార వైద్యం ఉంది దీని గురించి మనం తెలుసుకుందాం.
ఇప్పుడు మనం చూపును పెంచే చక్కటి జ్యూస్ దీని తయారీని తెలుసుకుందాం. మనం ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి అదేమిటంటే కంటి చూపు మందగించడం. కంటి చూపు మందగిస్తే ఇక లోకమంతా అంధకారమే కాబట్టి దీన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ కంటి చూపు మందగించడం కంటే ముందు ఒక 60, 70 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం రోజుల్లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలామంది ఈ సమస్యతో నానా ఇబ్బంది పడుతున్నారు.
ముఖ్యంగా ఆహారపు అలవాట్లు పోషకాహార లోపం జీవనశైలిలో ఉండేటటువంటి మార్పులు, అనేక రకరకాల మందులు వీటన్నిటిని ఎక్కువగా వాడడం ఇలా రకరకాల కారణాలవల్ల కంటిచూపు నెమ్మదిస్తూ నెమ్మదిస్తూ ఉంది. అయితే ఈ సమస్యను నివారించడానికి కొన్ని ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఈ జ్యూస్ ని తయారు చేసుకుని వాడుకుంటే కంటి చూపు పెరుగుతుంది. ఈ జ్యూస్ ని తయారు చేసుకోవడం కోసం ముందు ఒక పైనాపిల్ ని సగభాగం తీసుకుని ఆ పైన ఉండే పొట్టు అంతా ఫీల్ చేయాలి, లోపల భాగాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి, అలాగే చిన్న కీర దోస తీసుకొని దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి,
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ మరియు కీర ముక్కులను వేసుకోవాలి, తర్వాత అరకప్పు కొబ్బరి నీళ్లు కూడా వేసుకొని బ్లెండ్ చేయండి. అంతే మీకు ఒక కంటి చూపును పెంచేటటువంటి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఈ సూపర్ హెల్ది జ్యూస్ని ఉదయం లేదా సాయంత్రం తాగుతూ ఉంటే కంటి చూపు క్రమంగా పెరుగుతుంది. ఇదే సమయంలో కంటికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా దూరం అవుతాయి అంతేకాదు దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది దీన్ని వారంలో నాలుగు లేదా ఐదు సార్లు తాగుతూ ఉంటే ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. గుండె జబ్బులు వచ్చేటటువంటి రిస్క్ కూడా తగ్గుతుంది ,మూత్రపిండాలలో రాళ్లు తయారు కాకుండా ఉంటాయి, అన్నిటికి మించి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి.
ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్లో యుగంలో కళ్ళ పనితీరు దయనీయంగా మారిపోయింది. రాత్రింబవళ్లు కూడా ఈ కాంతులు వెదజల్లే ఫోన్లో లాప్టాప్స్ చూస్తూ మనం కళ్ళకి విశ్రాంతి లేకుండా చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా చీకటిగా ఉన్న గదిలో ఆ ఫోన్ చూడండి ఎంత వెలుతురు ఉంటుందంటే ఆ వెలుతురులో మొత్తం కనిపిస్తుంది, అంటే అంత వెలుతురు మన కళ్ళ మీద పడుతుంది. రాత్రి నిద్ర పోయేటప్పుడు కూడా ఈ కళ్ళ ముందు ఈ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే చాలామంది చూస్తూ చూస్తూ ఎప్పటికో అలసిపోయి నిద్రపోతారు. దాదాపుగా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ స్క్రీన్ టైమ్ ఉంటుంది అంటే, స్మార్ట్ ఫోన్ల కి మనం ఎంతగా అలవాటు పడిపోయాను మనకు అర్థమవుతుంది.
ఇక టీవీలు, ట్యాబ్స్ వీటితో గడుపుతూ కనీసం విశ్రాంతి అనేది మనం కళ్ళకు ఇవ్వడం లేదు. ఈమధ్య వర్క్ ఫ్రం హోం రావడం వల్ల కళ్ల పరిస్థితి ఇంకా దయనీయంగా మారిపోయింది ఆఫీసులో కంటే ఎక్కువ సమయం ఈ ఇంట్లో లాప్టాప్ ముందు గడుపుతున్నారు చాలామంది. ఇలా కళ్ళపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది ఈ నేపద్యంలో ఆరోగ్యంతో పాటు కళ్లను సైతం కాపాడుకోవడం చాలా ముఖ్యం దీనికి సంబంధించి ఒక ఇంటి వైద్యం తెలుసుకుందాం. ఇంటి వైద్యం విషయానికి వస్తే మనం ముందుగా తీసుకోవాల్సింది ఏమిటంటే ధాత్రి అంటే ఉసిరి పండ్లు ఇంకా తేనే ఇవి సిద్ధం చేసుకోవాలి. ఈ ఉసిపండ్ల రసం అంటే ఉసిరి కాయలను కాస్త వేడి చేసి దాని గుజ్జును గ్రైండర్లో వేసి తిప్పితే రసం వస్తుంది ఇలా ఈ రసాన్ని ఒక టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోవాలి. తేనెను రెండు టీ స్పూన్ల వరకు సిద్ధం చేసుకోవాలి ఈ రెండిటిని కలపాలి దీన్ని ఇలా లోపలికి సేవించండి. ఇలా ఈ ఇంటి వైద్యాన్ని రోజుకు రెండుసార్లు వాడుతూ ఉండండి.