కమలహాసన్ ఆరోగ్యం పై బయటపెట్టిన డాక్టర్

విశ్వ నటుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ గురించి ప్రతి ఒక్కరికి సపరిచితమే, ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి, విశ్వ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇలాంటి గొప్ప నటుడు నిన్న అస్వస్థత కారణంకా హాస్పిటల్లో చేరారు అంటూ, ఒక వార్త బయటకు వచ్చింది. అయితే ఆయనకి కొంచెం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించి

చెన్నైలోనే శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో చేర్పించారట, జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది తలెత్తడంతో, ఆయన తొందరగా హాస్పిటల్ కి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక విశ్వనాథుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్, దాదాపు 5 దశాబ్దాలు నుండి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక అలాంటి హీరో అస్వస్థతలో హాస్పటల్లో చేరారు అనే వార్త బయటకు రాగానే, చాలామంది ఆయన అభిమానులు అయోమయంలో పడ్డారు. ఏమైందో మా హీరోకి ఎందుకు ఇలా సడన్గా హాస్పటల్లో చేరారు,

ఆయనకు ఎలాంటి హామీ జరగకుండా, త్వరగా హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి రావాలి అంటూ దేవుని ప్రార్థిస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే, ఆయన హెల్త్ గురించి డాక్టర్లు కొన్ని విషయాలు చెప్పుకోచ్చారు. డాక్టర్లు మాట్లాడుతూ ఆయనకు జ్వరం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి హాస్పిటల్ కి వచ్చారు. ఇప్పుడు ఆయన బానే ఉన్నారు మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ఇంకో రెండు మూడు రోజుల్లో ఆయనని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తాము. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది.

మీరు ఎలాంటి భయాందోళనలో పడొద్దు అంటూ డాక్టర్లు కమలహాసన్ హెల్త్ పై ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇక కమలహాసన్ ఈ సంవత్సరం విక్రం సినిమాతో ఎంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మనకు తెలిసిందే. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన కమలహాసన్ సినీ కెరియర్ లోనే ఎక్కువ కనెక్షన్లు రాబట్టిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక త్వరలోనే కమలహాసన్ భారతీయుడు 2 సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇంతలోనే కమలహాసన్ హాస్పిటల్ లో చేరడం చాలా బాధాకరం, ఇక ఆయన హాస్పిటల్ నుండి త్వరగా కోలుకోవాలని మనం కూడా దేవుని ప్రార్థిద్దాం