కాకి కనిపిస్తే ఇది పెట్టండి చాలు మీ దశ తిరిగి అపర కోటీశ్వరులవుతారు

రేపు ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు, సాధారణంగా ఏకాదశి రోజు అన్న దానం చేస్తే చాలా మంచిది అని పెద్దలు చెబుతూ ఉంటారు, అలా అన్న దానం చేసే అంత స్తోమత లేని వారు, అన్నదానం చేసే వీలు లేని వారు కనిపిస్తే ఇలా చేసినా చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు అంటున్నారు. మరి ఏకాదశి రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలో మనం తెలుసుకుందాం! అందరి ఇళ్ల దగ్గరికి కాకులు వస్తూ ఉంటాయి, అలా కాకులు వచ్చినప్పుడు వాటిని దాదాపు అందరూ తోలేస్తూ ఉంటారు తప్ప, వాటికి ఏమి పెట్టారు, కొంతమంది కాకులకు ఆహారం పెడతారు. కానీ ఎక్కువ శాతం మంది కాకులను తరిమేస్తూ ఉంటారు, కానీ కాకులకు ఆహారంగా పెడితే ఎంత మంచిదో తెలుసా? కాకులకు అన్నం పెడితే ఎంత మంచి జరుగుతుందో తెలిస్తే మీరే కాకుల కోసం వెతుక్కుంటూ వెళ్లి మరి వాటికి ఆహారం పెడుతూ ఉంటారు. కాకులు పితృదేవతలకు అన్నం ఆహారం అందించే పవిత్ర జీవులు, చాలా కాలం క్రితం ఒక కాకి సూర్యుడు కోసం తపస్సు చేసింది, సూర్యుడు తక్షణమే కాకి తపస్సుకు కారణం ఏమిటి అని అడుగుతాడు, దానికి కాకి నన్ను ఈ లోకం లో అందరూ అసహ్యించుకుంటూ ఉన్నారు.

నేను కూడా ఒక వాహనం అవ్వాలి దానికి అనుగ్రహించు అని అడుగుతుంది. దానికి సూర్యుడు రెండు వారాలు ఇస్తాడు, ఒకటి పిత్రు దేవతలకు పెట్టే పిండం ఒక్క కాకులు మాత్రమే తినాలి, రెండవ వరం శనీశ్వరునికి వాహనంగా ఉండు అని, దానివలన నీకు గుర్తింపు వస్తుందని వరం ఇస్తాడు, ముఖ్యంగా ఏకాదశి రోజు కుదిరిన వారు కాకులకు అన్నం పెడితే ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, అష్టమ శని ,అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు అందులోనూ రేపు వచ్చే భీష్మ ఏకాదశి రోజు కాకులు కనబడితే వాటికి అన్నం పెట్టండి, ఆహారం పెట్టండి, మన పెద్దలు కాకి రూపంలో ఇంటికి వస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు, అందుకే కాకులను పితృదేవతల స్వరూపంగా భావించి అన్నం పెడతారు, ఎవరైతే ప్రతిరోజూ కాకికి అన్నం పెడతారో వారికి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది, పెద్దలకు తర్పణాలు వదలక పోయినా, ఆరోజు కాకికి అన్నం పెడితే పెద్దలు ఆశీర్వదిస్తారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు.

కాకులకు అన్నం పెట్టడం వల్ల కాకుల లోని పరమాత్మ సంతృప్తి చెందుతాడు, ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది, ప్రతినిత్యం ఎవరైతే కాకులకు అన్నం పెడతారో వారింట్లో ధనానికి లోటు ఉండదు, కనీసం ఏకాదశి వంటి పర్వదినాల్లో అయినా సరే కాకులకు అన్నం పెట్టినట్లయితే మన పితృదేవతలు యొక్క ఆత్మ శాంతిస్తుంది, వారి అనుగ్రహం లభిస్తుంది, పెద్దల అనుగ్రహం ఉంటేనే కుటుంబం వృద్ధిచెందుతుంది, ఇవన్నీ పక్కన పెడితే పశుపక్ష్యాదులకు అన్నం పెడితే మంచిదే కదా, ముఖ్యంగా కాకులకు అన్నం పెట్టడం వలన అటు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఇటు పితృదేవతల ఈ యొక్క దీవెనలు కూడా లభిస్తాయి, కుటుంబం కూడా వృద్ధి లోనికి వస్తుంది, మీరు కూడా కాకులు కనిపిస్తే అన్నం పెట్టి శుభ ఫలితాలను పొందండి, ఇలాంటి పర్వదినాల్లోనే కాకుండా, ప్రతి రోజూ ఒక ముద్ద అన్నం పెట్టండి,వాటి అనుగ్రహంతో మన వంశం వృద్ధి చెందుతుంది ,మంచి శుభాలను కూడా పొందవచ్చు.