కొండపల్లేరు మొక్క రహస్యం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే

మన ఆయుర్వేద సాంప్రదాయ వైద్యం ఎంతో గొప్పది మన భూమిమీద లభించే అనేక మొక్కలు అనేక రోగాలను నయం చేస్తాయి . ఆమొక్కల స్వభావాల గురించి ఆమొక్కలు ఏ రోగానికి ఏమొక్కలు ఉపయోగపడుతాయి . అనే విషయాన్నీ మన మహర్షులు పూర్వ కాలంలోనే రాత్రింపగళ్ళు ఎంతో కష్టపడి వాటి గురించి తాళపత్ర గ్రంధాలలో నిక్షిప్తం చేసారు . ఆయుర్వేదం వైద్యం వల్ల ఎలాంటి సైడ్ ఏవేక్ట్స్ ఉండవు . ఈ మధ్య అంతుపట్టని వైరస్ కు కృష్ణ పట్టణం లో నివసిస్తున్న ఆనందయ్య గారు ఆయుర్వేద ఔషదాన్నికనుగొని ఎంతో మంది ప్రాణాలు కాపాడారు . ఆనందయ్య వాడిన కొండపల్లేరు గురించి తెలుసుకుందాం .

పల్లేరు కాయలు పల్లెల్లో పుట్టిన వారికి పరిచయం ఉండే ఉంటాయి. ముళ్ళతో ఉండే ఈచిన్న కాయలు పల్లెలు సముద్రతీర ప్రాంతాల్లో, ఇసుక నేలల్లో అధికంగా ఉండి కాళ్ళకు గుచ్చుకుని విపరీతమైన నొప్పితో ఇబ్బందిపెడుతుంటాయి. ఈ పల్లేరుకాయలు ఉపయోగాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోతారు. ఈ పల్లేరుకాయలను దంచి అశ్వగంధ పాలలో మరిగించి తాగడంవలన అలసట, ఒత్తిడి, డయాబెటిస్, అధికబరువు వంటి సమస్యలు తగ్గిస్తుంది. ఈ కాయలను దంచి పొడి చేసి అందులో వావిలాకు పొడి కలిపి తాగడం వలన పురషులలో లైంగిక శక్తి పెరుగుతుంది. స్త్రీలలో బహిష్టు, గర్బాశయ దోషాలు తొలగిపోతాయి.

పల్లేరు కాయల్లో రెండు రకాలు ఉంటాయి.అవి ఒకటి చిన్న పల్లేరు కాయలు,కొండ పల్లేరు లేదా ఏనుగు పల్లేరుకాయలు అంటారు. పల్లేరుకాయలు పొడి తింటే ఆరోగ్యకరమైన సంతానం పుడుతుంది. ఈ పల్లేరుకాయలు నీటిలో మరిగించిన కషాయం రోజూ తాగితే పైత్యంవలన వచ్చే తలనొప్పి తగ్గుతుంది. పల్లేరుపువ్వులు మెత్తగా పేస్ట్ చేసుకుని కషాయంలా చేసుకుని తాగితే దగ్గు‌,క్షయ వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. పల్లేరుకాయలు పొడి పాలలో కలిపి తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. మొక్క వేళ్ళతో సహ దంచి పాలలో నానబెట్టి తర్వాత పాలు కలిపి వడకట్టి చూర్ణంలో తేనె కలిపి తాగితే ఆయాసం, ఉబ్బసం తగ్గడంలో సహాయపడతాయి.