కొడుకు చనిపోతే కొడలికి 2వ పెళ్లి చేసిన అత్తా ఆతర్వాత పెళ్లి మండపంలో ఏమైందో తెలుసా

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతిని మిగులుస్తుంది, సాధారణంగా అమ్మాయికైనా అబ్బాయి కైనా తల్లిదండ్రులు దగ్గరుండి పెళ్లి చేశారు, జీవితాంతం కలిసి ఉండాలని దీవిస్తారు కానీ, ఇప్పుడు మనం తెలుసుకో బోయే ఒక సంఘటన అత్తే ఒక అమ్మగా నిరూపించుకుంది.

అయితే వాళ్లను కాళ్ళ కింద పెట్టి తొక్కిపెట్టి ఉంచడం కోడలిపై పెత్తనం చెలాయించడం, ఇటువంటి రోజులు కాదండి, కొడుకును కీలుబొమ్మను చేసే కోడలు నీ రాచిరంపాన పెట్టే సమాజంలో, ఇక్కడ మనం సహజంగా ఎక్కువగా చూస్తూ ఉంటాం.

అయితే గతం కన్నా ఇప్పుడు కొద్దిగా తక్కువైనప్పటికీ కూడా, ఇంకా అత్తగారి లో కోడలు పైన పెత్తనం చేయడం ఇంకా తగ్గలేదు, కానీ మధ్యప్రదేశ్లో ఒక అత్త మామ తమ కోడలి పాలిట తల్లిదండ్రులుగా అవతారం ఎత్తారు. ఒకరకంగా ఈ వార్త అందరికీ విచిత్రమైనది కాని, ఆదర్శంగా భావించాలని ఇలా చేశామని వారు చెప్పడంతో ఈ వార్త విపరీతంగా వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ దార్లో జరిగిన సంఘటన అందరికీ కనువిప్పు కలిగించేలా చేసింది.

ప్రకాష్ తివారి రాగిణి తివారి దంపతులకు ఒకే ఒక్క కొడుకు, అయితే అతనికి వివాహం చేశారు కొడుకు కోడలు హాయిగా ఉన్న సమయంలో ప్రకాష్ తివారి కొడుకు అంటే ఈమె భర్త కరోనాతో గత ఏడాది చనిపోయాడు. చిన్న వయసులో కొడుకు చనిపోవడం వృద్ధాప్యంలో తమకు తోడుగా ఉండాలి అన్న ఆలోచనలతో, కోడలిని తమతోనే ఉంచుకున్నారు. ఇలాగే కొన్ని రోజులు గడిచిన తరువాత తాము చనిపోతే కోడలు ఒక్కతే వంటరిగా మిగిలిపోతుంది, అన్న ఒక మంచి ఆలోచన వారికి కలిగింది అందుకే కొడుకు దూరమై వాళ్ళు ఎంత బాధ పడుతున్నారో, భర్త లేని కోడలు అంతే బాధ పడుతుంది అని భావించి, ఆమెకు మరో పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం తలెత్తకుండా కుటుంబసభ్యులు సన్నిహితులు సలహా తీసుకొని, కోడలిని కూతురిగా దత్తత తీసుకొని కన్యాదానం చేశారు. సుమారు రెండేళ్ల క్రితం కొడుకు కోడలు అన్యోన్యంగా ఉన్న రోజులను గుర్తుచేసుకున్నారు తివారి దంపతులు.

అయితే ఇక చాలా సంబంధాలు వెతికారు, తన కొడుకు కన్నా బాగా చూసుకునే వ్యక్తి రావాలి అని, చివరికి బంధువులకు చెందిన ఒక వ్యక్తితో నిశ్చితార్థం చేయించారు, తమ కోడలిని కూతురు గా భావించి ఆమె ఇష్టప్రకారమే ఈ పెళ్లి చేసినట్టు నిర్ణయించారు. అయితే తన బిడ్డ చనిపోయినప్పటికి కూడా కోడలు ఒంటరి జీవితాన్ని గడపకూడదు అని, అందుకనే రెండో పెళ్లి చేశామని చెప్పారు. అయితే కేవలం కూతురుగా దత్తత తీసుకొని పెళ్లి చేయడమే కాదు, 60 లక్షల బంగ్లా నీ కూడా ఆమె పేరు మీద రాసి ఇచ్చారు.అయితే ఆ అల్లుడికి ఎటువంటి అవసరం పడిన కూడా కూతురికి ఇవ్వాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని మేము మీకు ఇస్తామని చెప్పడంతో, ఒక్కసారిగా ఇప్పుడు ప్రపంచం అంతా ఉలిక్కిపడింది. ఈరోజుల్లో కన్న కూతురునే తల్లిదండ్రులు బాధ్యత తీర్చుకున్నాము అనుకునే రోజులు ఇవి, అలాంటిది ఒక కోడలిని సొంత కూతురు లాగా భావించి, ఆమెకు 60 లక్షల రూపాయల బండ్లను ఆమె పేరు మీద రాసిచ్చి, ఒక మంచి పెళ్ళి కొడుకు ను వెతికి, దగ్గరుండి ఘనంగా పెళ్లి చేయడం అంటే, రెండు చేతులు జోడించి మొక్కలి అనిపిస్తుంది.