కొబ్బరి బెల్లం కలిపి తింటే ఈ దారుణ వ్యాధులు రమ్మన్నా రావు

చాలా రోజుల సమ్మేళనం వెనుక అద్భుతమైన వైద్య రహస్యం కూడా ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన పదార్థాలలో ఎంతో బలం దాగి ఉంది, దానిని వదిలేసి అడ్డమైన మందులు ప్రోటీన్ పౌడర్లు కొన్ని తాగుతూ రోగాల పాలు అవుతున్నారు జనం.

ఒక్క మాటలో చెప్పాలంటే కొబ్బరితో బెళ్ళాన్ని కలిపి తింటే చాలు సగం అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వీటిగునం పరిశీలిస్తే కొబ్బరి బెల్లంలో మెగ్నీషియం ఇనుము పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి.

దీనిలో క్యాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది, ఇవే కాకుండా ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల ఎన్నెన్నో రోగాలు తగ్గిపోతాయి. బెల్లం కొబ్బరి కలిపి మన చిన్నప్పుడు కొబ్బరి ఉండలుగా వీటిని కలిపి పెట్టేవారు తల్లిదండ్రులు. ఈ తరానికి అసలు కొబ్బరి ఉండ రుచి వాటిని చేసే విధానం, వాటి వల్ల ప్రయోజనాలు తెలియనే తెలియవు. కొబ్బరి ఉండల సంగతి ఇప్పుడు అంతా మర్చిపోయినట్టే ఉన్నారు. చాలా మంది కొబ్బరి తింటే దగ్గు వస్తుంది అని అంటూ ఉంటారు, అది తప్పు అసలు ఇలా బెల్లం కొబ్బరిని కలిపి తినడం వల్ల దగ్గు జలుబు సమస్యలు దూరం అవుతాయి.

అలాగే గోరువెచ్చని నీటిలో కొంచెం బెల్లం వేసుకొని తాగిన, లేదంటే టీలో చక్కెరకు బదులు బెల్లాన్ని వేసి తాగిన, శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇక కొబ్బరి బెల్లంను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.అలాగే ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. కొబ్బరి బెల్లం కలిపి తింటే బరువు సులభంగా తగ్గుతారు, కొబ్బరి బెల్లం లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు శరీరంలో నీరు అనవసరమైన దానికంటే ఎక్కువగా నిలువ లేకుండా చేస్తుంది, కొబ్బరి బెల్లంలో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.

అలాగే కీళ్ల నొప్పులు ఆర్థటైటిస్ ఉన్నవాళ్లు కూడా ఈ రెండింటినీ కలిపి తింటే అవి కూడా తగ్గిపోతాయి, గర్భంతో ఉన్న ఆడవారు కొబ్బరి బెల్లాన్ని తినడం వల్ల పిండంపై చెడు ప్రభావం తగ్గుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు వేరే ఇతర అనారోగ్యాలు రాకుండా కాపాడతాయి. అందుకే గర్భిణీలు కొబ్బరి బెల్లాన్ని ఏడవ నెల నుంచి తీసుకుంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. అలాగే మైగ్రేన్ ఉన్నవాళ్లు కొబ్బరి బెల్లాన్ని కలిపి తింటే మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి బెల్లం లో కార్బోహైడ్రేట్లో పుష్కలంగా ఉంటాయి, కాబట్టి అలసటగా ఉన్నప్పుడు కొబ్బరి బెల్లాన్ని తింటే తక్షణ శక్తి లభిస్తుంది. కాబట్టి మనవైన ఆహార పదార్థాలను ఎప్పుడూ వదులుకోవద్దు, ఎన్నో దారుణ వ్యాధులు రానీయకుండా ఈ కామినేషన్ పనిచేస్తుంది.