కలలు అనేవి మన ఆలోచనలకు, జరిగిపోయిన విషయాలను కలిపి దృశ్యాలుగా మార్చి చూపిస్తుంటాయి. అయితే ఇలా వచ్చే కలలు మనకు జరగబోయే మంచి చెడు విషయాలను కూడా మనకు సూచనలుగా తెలుపుతుంటాయి అని పండితులు చెబుతున్నారు.తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దేవతల యొక్క శక్తులు జాగృతం అవుతాయి. మనకు జరగబోయే అదృష్ట సంఘటనలకు కూడా కలలు ముందస్తు సూచనలు అవుతుంటాయి. కొందరికి తెల్లవారుజామున 3 గంటలకు మెలకువ వస్తూ ఉంటుంది.
భవిష్యత్తులో గొప్పవారు అవుతారు అనడానికి ఇలా మూడు గంటలకు మెలకువ రావడం ఒక సూచనగా చెబుతున్నారు. ఆ సమయంలో మెలకువ వస్తే దేవుని ప్రార్థించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. దేవుడు మనకు దయతో ఇవ్వాలని అనుకుంటే అది ఏదైనా అక్షయంగా ఇస్తుంటారు.అందుకు ఉదాహరణ వరలక్ష్మీ దేవి కథ అందులో చారుమతి దేవి అనే భక్తురాలికి వరలక్ష్మీ దేవి కలలో ప్రత్యక్షమై ఆమె పూజ చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పి తనకి పూజ చేపించుకొని ఆ భక్తురాలికి సుసంపన్నమైన బంగారం, డబ్బు కానుకగా ఇచ్చింది. మనం ధర్మబద్ధమైన, న్యాయ మార్గంలో నడుస్తూ ఉంటే దేవతలు మన పై దయ చూపుతారని ఈ కథ మనకు ఉదాహరణ.
అలాగే మరో కథలో మంగళగౌరీ దేవి కలలో కనిపించి తన భక్తురాలి భర్తకి రాబోయే ప్రమాదాన్ని చెప్పి దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి ఆపద నుండి బయట పడటం ఎలాగో ఏం చేయాలో చెప్పింది. దాని నుండి బయటపడి ఆ భక్తురాలు అమ్మవారికి ప్రార్థించింది. పెద్ద పెద్ద కొండల నుండి జాలువారుతున్న నేటి సమూహం నుండి నీటిని కనుక మనం తాగుతున్నట్లు కలలో కనిపిస్తే అది మన విజయానికి సంకేతంగా భావించాలి.కొండలపై నుంచి జారుతున్న నీటి సమూహం ధన ప్రవాహంగా అందులో నుంచి మనం తీసుకున్న నీటిని దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ప్రసాదంగా మనం స్వీకరిస్తున్నట్లుగా భావించాలి.
భగవంతుని ప్రార్థించడం వల్ల ఆర్థిక పరంగా, సామాజికంగా మంచి స్థాయిలో నిలబెడతాడు. భగవంతుని దయను మనం స్వీకరిస్తున్నట్లుగా కూడా మనం భావించవచ్చు. అలాగే మనం ఇష్టంగా పూజించే భగవంతుడు కలలో కనిపిస్తే మనకు మంచి జరిగుతున్నట్లు భావించాలి.ఇలా మన ఇష్టదైవాల్ని కలలో కనిపించినప్పుడు ఎవరికీ చెప్పకుండా ఇష్ట దేవతలను పూజించడం ద్వారా మనం మనకు జరగబోయే మంచి, చెడులను దేవునికి వదిలేయటం జరుగుతుంది. దీని వలన చెడు నుండి బయటపడుతూ మంచిని పొందేందుకు భగవంతుడు నీకు అవకాశం కల్పిస్తున్నట్లు భావించాలి.