ఖర్చులు, అనారోగ్యాలు లేకుండా, లక్ష్మి దేవి స్థిరంగా వుండేందుకు, ఖర్చు లేని రాగి చెంబు పరిహారం.

లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి మనం చేసే పరిహారాలలో రాగి చెంబు పరిహారం చాలా విశేషమైనటువంటిది. రాగి చెంబుతో ఎలాంటి పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా మనకు లభిస్తుందో, ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇంటిని శుభ్రపరచుకొని ఇంటిని శుభ్రపరిచేటటువంటి నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు కొద్దిగా పసుపు వేసి తుడిచినట్లయితే, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మనం ప్రతి రోజు ఇల్లుని చిమ్ముతాం కదా అప్పుడు ఈ రాగి చెంబుకి చీపురు తగలకుండా ఉండేందుకు కోసం, ఒక ఎత్తుగా ఉన్నటువంటి చేక్కను గానీ చెక్క పీటలు కానీ ఏర్పాటు చేసుకోవాలి.

ఒక పళ్లెంలో కొద్దిగా పసుపును తీసుకొని పసుపును పన్నీరుతో గాని శుభ్రమైన నీటితో గాని కలుపుకొని, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పీటకు ఎటువంటి గ్యాప్ లేకుండా చక్కగా పసుపుని రాసుకోవాలి . ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పీటకి పసుపు రాసిన తర్వాత ఈ పీఠం మీద కుబేర ముగ్గును వేయాలి.

కుబేర ముగ్గు ఎలా వేయాలో మీకు తెలిసే ఉంటుంది.కొంతమంది ఇళ్లలో సంపాదన బాగానే ఉంటుంది కానీ ఇంట్లోకి ఎంత డబ్బు వచ్చినా డబ్బు ఇంట్లో నిలవకుండా అనవసరమైన ఖర్చులకి అనారోగ్యాలకి ఖర్చవుతూ ఉంటుంది. ఇంట్లో డబ్బు నిలవడం లేదు అని బాధపడుతూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలి అన్న ప్రవేశించిన లక్ష్మీ అమ్మవారు ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరుచుకోవాలి అన్న, ఇలా రాగి చెంబుతో పరిహారాన్ని చేసినట్లయితే మన ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మనం ఏర్పాటు చేసుకున్న పీట మీద చక్కగా కుబేర ముగ్గును వేసుకొని దానిని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి.

మన ఆదాయం పెరగాలి అన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అన్న, ఈశాన్యంలో ఇది పాటిస్తే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ పూజ ని ఎవ్వరైనా చేసుకోవచ్చు, ఆనవాయితీ అంటూ ఏమీ లేదు. ఆదాయం పెరగాలి అనుకునేటటువంటివారు, ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని అనుకునే అటువంటి వారు ఎటువంటి సందేహం లేకుండా ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాలను పొందవచ్చు. ఇప్పుడు ఆ పీట మీద కుబేర ముగ్గును వేసిన తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించుకొని దాని మీద ఒక తమలపాకును కుబేర ముగ్గు మధ్య భాగంలో ఉంచి, పసుపు కుంకుమ అక్షింతలను తమలపాకులో ఉంచాలి.

ఈ పరిహారానికి ముఖ్యమైనటువంటిది రాగి చెంబు రాగి చెంబును కానీ ఇత్తడి చెంబును కానీ వాడవచ్చును, రాగి చెంబు శ్రేష్ఠమైనటువంటిది మనం పరిహారానికి ఉపయోగించేటటువంటి రాగి చెంబు చక్కగా శుభ్రపరచినదై ఉండాలి. ఎటువంటి మచ్చలు మరకలు ఉండకూడదు, మచ్చలు మరకలు ఉన్నటువంటి రాగి చెంబుతో పరిహారం చేసిన ఫలితం ఉండదు. పరిహారానికి ఉపయోగించేటటువంటి రాగి చెంబును చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఈ రాగి చెంబు మీద స్వస్తిక్ గుర్తును కూడా ఉంచవచ్చు. అలంకరించిన రాగి చెంబును మనం ఏర్పాటు చేసుకున్నటువంటి తమలపాకు మీద ఈ రాగి చెంబును ఉంచుకోవాలి.

ఈ రాగి చెంబులో శుభ్రమైనటువంటి నీటిని పోయాలి, నీటిని రాగి చెంబు నిండుగా ఉంచాలి, మనం వాడేటటువంటి నీరు నిండుకుండదై ఉండాలి. అంటే మనము అప్పుడే తెచ్చుకున్నటువంటి నీటిని వాడాలి, మనం కొద్దిగా వాడి మిగిలిన నీటిని వాడకూడదు. రాగి చెంబు నిండా నీళ్లు పోసిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా అక్షింతలను ఉంచి అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది సువాసన భరితమైనటువంటి జవ్వదును, పచ్చ కర్పూరాన్ని ఈ నీటిలో ఉంచాలి, మంగళకరమైనటువంటి లక్ష్మీ గవ్వలను, గోమతి చక్రాలను, ఒక రాగి నానాన్ని, ఈ నీటిలో ఉంచాలి. రాగి నానం లేనట్టయితే మామూలుగా మనం రూపాయి నానాన్ని కూడా ఈ నీటిలో ఉంచవచ్చు. ఆ తర్వాత ఈ నీటిలో పువ్వులను ఉంచాలి.

కొత్తగా ఏర్పాటు చేసుకోవాలి అని అనుకునేటటువంటి వారు, శుక్రవారం కానీ మంచి తిధి ఉన్నటువంటి రోజులు కానీ ప్రారంభించవచ్చు. ఆ రాగి చెంబు ముందు ఒక రాగి ప్లేటును ఏర్పాటు చేసుకొని ఆ ప్లేటులో నవధాన్యాలను ఐదు పిడికిలు పోయాలి. ఈ నవధాన్యాల మీద ఇత్తడి ప్రమిదను కానీ, రాగి ప్రమిదను కానీ ఈ రెండు లేనటువంటి పరిస్థితులలో మట్టి ప్రమిదను కానీ తీసుకొని, పసుపు కుంకుమలతో అలంకరించి ఏర్పాటు చేసుకున్నటువంటి నవధాన్యాల మీద రాగి చెంబు ముందు భాగంలో ఏర్పాటు చేసుకోవాలి, ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రమిదలు నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ ఉంచి రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి ఏక హారతి తో దీపాన్ని వెలిగించాలి. వెలుగుతున్నటువంటి దీపానికి కుంకుమ అక్షింతలను పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి. ఇప్పుడు ఒక పసుపు కొమ్మును తీసుకొని చక్కగా పసుపు కొమ్ము నిండుగా పసుపును రాసి కుంకుమ బొట్ల నుంచి ఈ నవధాన్యాలలోనే ఉంచాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.