గుండె రక్తనాళాన్ని క్లీన్ చేసి BP దూరం

పూర్వం రోజుల్లో అందరూ సజ్జ రొట్టె, సజ్జ అప్పాలు, సజ్జసంకటి, సజ్జ దోషలు, సజ్జ ఇడ్లీ , సజ్జరవ్వ ఉప్మా అన్ని ఇవే చేసేవారు. ఈ మధ్యకాలంలో ఇతర మిల్లెట్స్ వైపు బియ్యం వైపు జనం మళ్ళీ పోయి, సజ్జలను పక్కకు పెట్టేశారు. సజ్జలు తినడం వల్ల అయిదు లాభాలు ఉన్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ వారు స్పెషల్గా ప్రచురించిన దానిని ఆధారంగా చేసుకుని, ఐదు బెనిఫిట్స్ సజ్జల్లో ఉన్నాయని వారు నిరూపించిన ఈ విషయాలను తెలుసుకుందాం. సజ్జల వల్ల వచ్చే మొట్టమొదటి ఫలితం సజ్జలు నెంబర్ వన్ ఆల్కలీన్ డైట్ ఇది. పొట్టలో అల్సర్ రావడానికి మనం తినే ఎసిడిక్ ఫుడ్ కారణం అవుతుంది, అతిగా పులిసినవి అలాగే అతిగా ఎరువులు, పురుగుమందులు, కెమికల్స్ వాడినవి అలాగే కూల్డ్రింక్స్ పంచదార ఇలాంటివన్నీ కూడా ఎసిడిక్ ఫుడ్స్.

ఈ ఎసిడిక్ ఫుడ్స్ వల్ల అల్సరేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గ్యాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని సజ్జలను వాడినప్పుడు అంటే ఏ రూపంలో సజ్జలను వాడిన ఇది ఆల్కలినిటీని పెంచుతాయి అంటే ఆమ్ల స్వభావాన్ని తగ్గించి క్షార స్వభావాన్ని పెంచే గుణం సజ్జలలో ఉంటుంది. అందుకని దీనివల్ల అల్సర్స్ ఎసిడిటీ ఇలాంటివి రాకుండా రక్షించడానికి సజ్జలు నెంబర్ వన్ గా పొట్ట ప్రేగులకి అద్భుతంగా హెల్ప్ చేస్తాయి. ఇక రెండవ ఫలితం ఏమిటంటే హార్ట్ ని కండిషన్లో పెట్టడానికి, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచడానికి , బ్లడ్ వేజల్స్ స్మూత్ గా ఉంచడానికి సజ్జలని 100 గ్రాములు తీసుకున్నప్పుడు అందులో మెగ్నీషియం 115 మిల్లిగ్రాములు ఉంటుంది.

అలాగే దీంతోపాటు ఫైటోక్ న్యూట్రియన్స్ ఉంటాయి. ఈ ఫైటోక్ న్యూట్రియన్స్ మరియు మెగ్నీషియం రెండిటికి కాంబినేషన్ అనేది హార్ట్ కి ,బ్లడ్ వేజల్స్ ని స్మూత్ గా ఉంచి బిపి వచ్చిన కంట్రోల్లో ఉంచడానికి సజ్జలు ఉపయోగపడుతున్నాయి అనేది అంటే మన లైఫ్ రిస్క్ సమస్యల నుండి రక్షించడానికి సజ్జలు బాగా ఉపయోగపడుతున్నాయి ఇది రెండవ లాభం. ఇక మూడవ లాభం ఏమిటంటే, సజ్జలలో ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది,ఎముకలకి కాల్షియంతో పాటు ఫాస్పరస్ కావాలి కదా, 255 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది దీని ద్వారా ఎక్కువ ఫాస్పరస్ అనేది వెళ్తుంది ,ఇది బోన్ సెల్స్ ని రిపేర్ చేయడానికి బోన్ సెల్స్ లోకి క్యాల్షియం అబ్సెప్షన్ ని పెంచడానికి ఈ పాస్పరస్ బోన్ స్ట్రెంత్ కాస్త హెల్దిగా ఉంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.