గుడ్డు శరీరంలో ఎలా పనిచేస్తుంది……. గుడ్డు తినే విధానం

గుడ్లు అంటే చాలామందికి చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. మొదటిది వెజిటేరియన్ లేదా నాన్ వెజ్తెరియానా అని, రెండవదిగా ఇది అందరూ తినొచ్చా లేదా అని అపోహలు ఉంటాయి. ఇలాంటి చాలా అభిప్రాయాలు మన అందరిలో ఉన్నాయి. గుడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక గుడ్డులో విటమిన్ సి తప్ప మిగిలిన అన్ని పోషకాలు, విటమిన్స్, క్యాలరీలు, ప్రోటీన్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. కనక దీనిని స్మాల్ సైజ్ న్యూట్రిషన్ ప్యాకెట్ అని కూడా అనవచ్చు. కనుక అన్ని పోషకాలు ఒక గుడ్డు ద్వారా అందుతాయి.

ఈ మధ్యకాలంలో సెంటర్ అమెరికాలో ఒక రీసెర్చ్ చేశారు. దానిలో ఆరు నెలలపాటు పాలు మానిన పిల్లలకు రోజు గుడ్డు ఇచ్చారు ఇచ్చిన పిల్లలతో పోల్చి చూస్తే ఇవ్వని పిల్లలను గ్రోత్ తక్కువగా ఉంది. గుడ్డు ఇచ్చిన పిల్లలకు గ్రోత్, డెవలప్మెంట్ చాలా బాగుంది. మరియు కాగ్నీటివ్ డెవలప్మెంట్ అంటాం.కాగ్నీటీవ్ డెవలప్మెంట్ అంటే ఎమోషనల్ స్ట్రెంత్, బ్రెయిన్ న్యూరాలజీకల్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. కనుక ఇది కూడా గుడ్డు తిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా గుడ్డు తినడం వలన గ్రోత్, బ్రెయిన్ డెవలప్మెంట్, ఇంటీలేఛాల్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది.

ఇంకొకటి ఏమిటంటే మజిల్ గ్రోత్ కు చాలా ఉపయోగపడుతుంది. ఇది చిన్న పిల్లలకు కాకుండా పెద్దవాళ్లకు ముసలి వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. మరియు 11 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నవారికి ఎవరికైతే గ్రోత్ అవసరమె వారికి రోజు గనుక గుడ్డు ఇస్తే వారికి మజీల్ డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో హై బయోలాజికల్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది మన బాడీ అబ్జర్వర్ రేట్ ను మెరుగుపరుస్తుంది అందువల్ల గుడ్డును ఒక ఆరోగ్యమైన ఆహారం అని చెప్పవచ్చు.

వీటిని ఉడకబెట్టుకొని గాని ఆంబ్లెట్ రూపంలో, ప్రైస్, కర్రీస్ రూపంలో తీసుకోవచ్చు. ఇది బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఇంకా మంచిది. మజిల్ ఇంప్రూవ్మెంట్ కావాల్సినవారు ఎక్సైజ్ చేసేవారు స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసేవారు వారి ఆహారంలో గుడ్డును చేర్చుకోవడం చాలా మంచిది. దీనిలో బయోటీన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది మన చర్మం, హెయిర్ గ్రోత్ కు బాగా ఉపయోగపడుతుంది. అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా ఉపయోగించవచ్చు. గుడ్డులో ఉండే కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేయదు. కనుక గుడ్డు మొత్తాన్ని పూర్తిగా తీసుకోవచ్చు.