ఇంట్లో డబ్బుకు కొదవ లేకుండా ఉండాలి అంటే కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. బియ్యం పసుపుతో ఇంట్లో ఏం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, అలాగే కొన్ని వాస్తు టిప్స్ కూడా పాటిస్తే మంచి ఫలితం కూడా కలుగుతుంది. ఇటువంటివన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంట్లో పసుపు శుభప్రదం అని అంటారు. ఈ పసుపుని ఉపయోగించి ఏం చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పసుపును తీసుకోండి తర్వాత తెల్లటి దారం తీసుకొని దానికి పసుపు రాయండి, ఈ పసుపు రాసిన దారాన్ని ఒక నెమలీక తీసుకుని దానికి చుట్టండి,
తర్వాత ఒక గ్లాసులో తెల్లటి బియ్యాన్ని పోసి, నెమలికను ఆ గ్లాస్ లో పెట్టి ఇంట్లో ఈశాన్యం మూల పెట్టండి, ఇదంతా కూడా గురువారం చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపన్నులవుతారు. వంటింట్లో వాస్తు దోషాలు ఉంటే దాని ప్రభావం ఆ ఇంటిపై మాత్రమే కాదు, ఆ ఇంటి ఇల్లాలకి ఆరోగ్యపరమైన సమస్యలు, యజమానికి మెంటల్ స్ట్రెస్ వంటి సమస్యలు ఉంటాయి. వంటింట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, లేదంటే ఆ ఇంటి ఇల్లాలకు తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అది ఇంటి యజమానికి కూడా చిరాకుగా అనిపిస్తుంది.
అందుకే ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా నవ్వుతూ వంట చేయాలి. అంతేకాదు తూర్పు వైపుకు తిరిగి వంట చేయాలి. చేయాల్సి ఉంటుంది.ముఖ్యంగా వంట ఇల్లు ఇరుకుగా ఉండకుండా చూసుకోండి, ఈశాన్యం వైపు తిరిగి వంట చేస్తే ఇల్లాలికి తలనొప్పి సమస్యలు వస్తాయి. గ్యాస్ స్టవ్ తూర్పు గోడకు ఆనించి ఉంటే చాలా సమస్యలు వస్తాయి. వంటగదిలో వాస్తు దోషం ఉంటే ఆహారం రుచిగా ఉండదు. ఫ్రిడ్జ్ ని కూడా పడమర వైపు ఉంచండి, వంట గదిలో దేవుడిని పెట్టకండి, దేవుడికి సంబంధించిన అంతవరకు ఈశాన్యం వైపు కట్టించుకోండి. ముఖ్యంగా జడ వీరబోసుకుని వంటింట్లోకి వెళ్ళవద్దు. వంట గదిలో స్త్రీ కంటనీరు పెట్టుకుంటే ఆ సంసారం నాశనమవుతుంది. వంటగదిలోకి వెళ్ళగానే పరమపవిత్రంగా భావించి పోయ్యి వెలిగించి నమస్కరించుకోవాలి.
వండిన పదార్థాలను దక్షిణ దిశలోనూ లేదా పడమ దిశలో పెట్టుకోండి. అలాగే స్టవ్ పైన పెట్టవద్దు, ఖాళీ గిన్నెలు పోయ్యి ఆదాయానికి మించిన ఖర్చు వస్తుంది అంటారు. వంటగదిలో వస్తువులను వాస్తు పరంగా అమర్చుకోండి, వంటగది ఈశాన్యంలో సింక్ పెట్టండి. ఆగ్నేయం వైపు పెట్టుకోండి. ఈశాన్యం షింకులో ఎంగిలి వస్తువులు పెట్టకండి కంచాలను వెంటనే కడిగేసుకోండి.అయితే వండిన పాత్రలను శింకులో పెట్టుకోవచ్చు, బియ్యం డబ్బా ను నైరుతి దిక్కులో పెట్టుకోండి. లేదా రిఫ్రిజిరేటర్ పెట్టవచ్చు. ఉత్తర భాగంలో తేలికైన వస్తువులను పెట్టుకోవచ్చు, ఉప్పు ఆ వంట గదిలో ఆగ్నేయం వైపుకు ఉండాలి. వంట చేసిన తర్వాత ఏదైనా వంటకంలో ఉప్పు తగ్గితే అలాగే తీసుకోవద్దు, ఎడమ చేతిలో ఉప్పు నే తీయకండి. అది దరిద్రం ఆ ఉప్పు పనికిరాదు. మిగతా చిన్న వస్తువులు ఉత్తర దిశగా చిన్న సెల్ఫ్ ఏర్పాటు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే వంటగది వాస్తు ప్రకారం కూడా అనుకూలంగా ఉంటుంది, ఏ వంటకం చేసినా రుచికరంగా ఉంటుంది.