ఈమధ్య ఆన్లైన్ లో గుర్రపు నాడ ను అమ్మేస్తున్నారు, గుర్రపు నాడకు ఇంత ముందుకు లేని క్రేజ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఇది పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందంట.
తర్వాత దిష్టి తగలదు అంటారు, ఇది ఎంతవరకు నిజం అనే విషయాలు తెలుసుకుందాం. గుర్రపు నాడ అనేది దానికి పుట్టుకతో వచ్చింది కాదు, ఎడ్ల కు కానీ గుర్రాలకు కానీ వాటి కాళ్లకు గిత్తలు ఉంటాయి.
ఇవి తొందరగా పాడవుతాయి ఇవి తొందరగా పాడవకుండా వాటికీ ఒక యు షేప్ లో ఉండే ఇనుప వస్తువుని తయారుచేయించి ఆ నాడని వాటి కాళ్ళకు కొడతారు.
ఇలా చేయడం వల్ల అవి ఎక్కువకాలం పనిచేస్తాయి, ఇలా మనం గుర్రాలను వాడడం మొదలు పెట్టాక వాటి తో పని చేయించడం కోసం మనుషులు కనిపెట్టిందే గుర్రపు నాడ, ఇలా చేయడం వల్ల దాని కాళ్ల గిత్త లోకి ఏమి కుచ్చుకోకుండా ఉంటుంది ,అంతే కానీ వాటికి నాడ అనేదిపుట్టుకతో రాదు. ఇది కూడా కొన్ని రోజులకు అరిగిపోయి అవి ఇబ్బంది పడుతూ ఉంటే, వాటిని నేల మీద పడేసి అరిగిన నాడలను లాగుతారు, ఇలా చేస్తున్నప్పుడు అవి చాలా బాధను అనుభవిస్తాయి. ఇప్పుడు అలాంటి గుర్రాల తాలూకు ఒక గుర్రపు నాడ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాము అంటే, మీరు గుర్రపు కాలుది తీయాలి కదా, పైగా ఆన్లైన్ అమ్మకాలు అంటే వాళ్లు గుర్రాలవే తేస్తున్నాడా లేదంటే ఊరికే వస్తువు తయారు చేసి అమ్ముతున్నాడో మనకు తెలియదు కదా, ఉపయోగించిన వస్తువు పెట్టుకోవాలని చెప్తున్నారు. దేవునికి పూజ చేసుకొని, వీలైనంతవరకు ఇతరులకు సహాయం చేసి , నీ వల్ల ఎవరికీ చెడు జరగకుండా చూసుకుంటే భగవంతుడు కచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, నీ వెనకాల ఉంటాడు, ఒక నాడ తెచ్చి పెట్టుకుంటే ఎలా అదృష్టం కలిసొస్తుంది?
గుర్రపు నాడ ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం అనేది చాలా పాత మాట, దీనివల్ల శని ప్రభావం తగ్గుతుందని, దృష్టి దోషం తగ్గుతుందని చాలా తక్కువ మంది ఎవరో ఒకరు అంటూ ఉండేవారు. వీటిని నమ్మకూడదు, ఇవన్నీ మూఢనమ్మకం, ఇలా ఇంటర్నెట్ లో లో ఎంతమంది కొనగలరు, అసలు అవి గుర్రం నుండి తీసినవేనా లేదా మామూలుగా తయారు చేసి అమ్ముతున్నారా అనేది ఎవరికీ తెలియదు. గుర్రపు నాడ ఆకారంలో ఉండే ఇనుప వస్తువును ఇంటి వాకిట్లో వ్రేలాడ తీస్తే, నెగిటివ్ ఎనర్జీ ని తీసుకుంటుందని, శనీశ్వరుని ప్రభావాన్ని తగ్గిస్తుందని భావన. ఇలాంటివి పాటించకుండా శనీశ్వరుని ప్రభావానికి తగ్గించడం కోసం ప్రతి శనివారం రోజు ఇంట్లో వాళ్లంతా,ఒళ్లంతా నువ్వుల నూనె రాసుకుని బాగా నలుగు పెట్టుకొని స్నానం చేయండి, శని ప్రభావం తగ్గుతుంది, ఇవన్నీ పాటించకుండా ఒక గుర్రపు నాడ ను తెచ్చి పెట్టుకుంటే శని ప్రభావం పోతుందా?
ఇలా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించండి, సరైన పద్ధతిలో ఆలోచించండి , దీనివల్ల ప్రయోజనం లభిస్తుందని మీరు ప్రగాఢంగా నమ్మితే ఒక కొత్త గుర్రపు నాడ షేపులో ఉన్న వస్తువును తెచ్చి పెట్టుకోండి, కానీ ఇలా లైవ్గుర్రాలవి మాత్రమే పెట్టుకోవాలి అనే ప్రచారం తప్పు, వాటి కోసం ప్రయత్నించడం తప్పు, ఒకవేళ ప్రయత్నం చేసిన ఎంతమందికి దొరుకుతాయి అనే ఆలోచనలు చేయండి, ఎన్ని గుర్రాలను హింస పెడితే ఈ జనాలందరికీ సరిపోతాయి అనే విషయాలను ఆలోచించండి.