గోపిచంద్ భార్యను చూస్తే

ఇప్పుడున్న యాక్షన్ హీరోలలో గోపీచంద్ కూడా ఒకరూ అతే కొద్ది మందికి మాత్రమే ఉండే మాస్ ఇమేజ్ ఆయన సొంతం. ఎలాంటి కల్మషం లేని కష్టం విలువ తెలిసిన మంచి మనిషి గోపీచంద్. ఇప్పుడు మనం గోపీచంద్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ప్రముఖ డైరెక్టర్ ట్ కృష్ణ గారి రెండవ కుమారుడే గోపీచంద్. T కృష్ణ గారు సమాజంలో ఉన్న సమస్యలను ఆధారంగా చేసుకుని, వందేమాతరం, నేటి భారతం, ప్రతిఘటన,

రేపటి పౌరులు వంటి సినిమాలను రూపొందించి, మంచి విప్లవాత్మక డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. గోపీచంద్ కి ఎనిమిదేళ్లు ఉన్నప్పుడే కృష్ణ గారు అనారోగ్యంతో మరణించారు. గోపీచంద్ అమ్మ పేరు కోటీశ్వరమ్మ, బ్రదర్ ప్రేమ్చంద్ ,కొంతకాలం క్రితం ప్రేమ్చంద్ గారు రోడ్ యాక్సిడెంట్లో మరణించారు. 1979 జూన్ 12న ఒంగోలులో గోపీచంద్ జన్మించాడు. చెన్నైలోని రామకృష్ణ హై స్కూల్ లో గోపీచంద్ చదువుకున్నాడు.

ఆ తరువాత రష్యాలో మెకానికల్ ఇంజనీర్ కంప్లీట్ చేశాడు, తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు గోపీచంద్. మొదట్లో గోపీచంద్ కి యాక్టింగ్ అంటే అంత ఇష్టం ఉండేది కాదట, కానీ గోపీచంద్ లో ఉన్న టాలెంట్ ని గుర్తించిన డైరెక్టర్, తేజ తన జయం సినిమాలో విలన్ గా ఛాన్స్ ఇచ్చి గోపీచంద్ ని ప్రోత్సహించాడు. ఆ తర్వాత గోపీచంద్ వర్షం, నిజం సినిమాల్లో వైవిధ్యంగా నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.అదే సమయంలో సొంత బ్యానర్లో యజ్ఞం సినిమాలో హీరోగా నటించిన హీరోగా స్థిరపడ్డారు. చదువు పూర్తయ్యాక తను నటించిన డైలాగ్ మార్చులేషన్ కోర్సు గోపిచంద్ కి ఎంతగానో ఉపయోగపడింది.

మంచి హైట్ 6 ప్యాక్ బాడీతో, ఆకర్షించే కళ్ళతో స్పష్టమైన డైలాగులతో ఒక యాక్షన్, హీరోలకి ఉండాల్సిన అన్ని లక్షణాలు గోపీచంద్ లో ఉండడం వల్ల, తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.యజ్ఞం సినిమా తర్వాత రణం, లక్ష్యం, సౌర్యం,లౌక్యం, సిటిమార్ వంటి అద్భుతమైన సినిమాలో చేశాడు. గోపీచంద్ 2013 మే 12న రేష్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గోపీచంద్ రేష్మ మరెవరో కాదు, హీరో శ్రీకాంత్ గారి మేనకోడలే .శ్రీకాంత్ సొంత అక్క కూతురుని గోపీచంద్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. గోపీచంద్ రేష్మ దంపతులకు వియాన్ అనే ఒక పాప విరాట్ కృష్ణా అనే ఒక బాబు ఉన్నారు. రేష్మ అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంది. రేష్మ ని ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో చూసి ఇష్టపడే. సంబంధం మాట్లాడుకుని వివాహం చేసుకున్నాడు గోపీచంద్.