గోరువెచ్చని కొబ్బరి నూనె రెండు చుక్కలు బోడ్డులో వేసి మసాజ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా. పూర్వం విపరీతంగా చేసేవారు.

ఈరోజు మనం నాభీ గురించి తెలుసుకుందాం. అంటే పొట్ట మధ్యలో ఉండే బొడ్డు అని పిలవబడే నాభీ గురించి తెలుసుకుందాం. నాభీ స్థానం మన శరీరానికి చాలా ముఖ్యం. ఇది అందరికీ చాలా చాలా ప్రాముఖ్యం. పూర్వకాలంలో పెద్దలు చిన్నపిల్లలకు తలపై, చెవుల్లో, బొడ్డులో రెండు చుక్కల నూనె వేసి బాగా మసాజ్ చేసి తలస్నానం చేయించేవారు. ప్రస్తుత కాలంలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని ఎవరు చేయడం లేదు. ముఖ్యంగా మన బొడ్డు దగ్గర 7200 నాడులు కనెక్ట్ అయి ఉంటాయి. మన జీర్ణవ్యవస్థ నుంచి శక్తి వరకు పూర్తిగా ఈ స్థానంతోనే కనెక్ట్ అయి ఉంటాయి.

దీనిని సూర్య స్థానం అని కూడా అంటారు. అగ్ని అక్కడ ఉంటుంది. దానిని జటరాగ్ని అంటారు. అంటే ఇది చాలా వేడిగా ఉంటుంది. ఇది చల్లబడడానికి ఏం చేయాలి అంటే వారానికి ఒకటి లేదా రెండుసార్లు కొబ్బరి నూనె లేదా ఆముదం నూనెను రెండు చుక్కలు గోరువెచ్చగా వేడి చేసి ఆ వేడి నూనెను బొడ్డులో రెండు మూడు చుక్కలు వేసి మెల్లగా సర్కిల్ గా మసాజ్ చేయాలి. ఇలా బొడ్డు లోపల మసాజ్ చేయాలి. ఆ తర్వాత మన ఆరచెయ్యి సహాయంతో పొట్టపై మెల్లగా మసాజ్ చేయాలి. ఇది ఎవరికి వారే చేసుకోవచ్చు. మరియు చాలా సులభంగా ఉంటుంది.

ఇలా చేయడం ద్వారా జీర్ణ సంబంధ సమస్యలు అన్ని కంట్రోల్ లోకి వస్తాయి. అలాగే కడుపులో మంట విరోచనం సరిగ్గా అవ్వకపోవడం అంటే చాలామందికి మలబద్ధకం ఉంటుంది. ఇవన్నీ కూడా కంట్రోల్ లోకి వస్తాయి. ఎందుకంటే ఇలా మసాజ్ చేయడం ద్వారా అన్ని నాడులు ఆక్టివేట్ అవ్వడమే కాకుండా పొట్టపై మసాజ్ చేయడం వలన మాయిశ్చరైజ్ అయ్యి చల్లగా అవుతుంది. చాలామంది చంటి పిల్లలు అనగా రోజుల పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. వారు ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాదు. వారికి పొట్టలో గ్యాస్ పట్టి ఉబ్బరంగా అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు.

వీరికి రెండు చుక్కల కొబ్బరి నూనె లేదా తీసుకొని పొట్టపై మసాజ్ చేయడం వలన గ్యాస్ ప్రాబ్లం నుంచి విడుదల పొందుతారు. కనుక ఈ విధంగా కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వలన మలబద్ధకం నుంచి విడుదల పొందడమే కాకుండా మంచి నిద్ర కూడా పడుతుంది. మరియు కాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గుతాయి. మరియు కళ్ళు మంటలు తగ్గుతాయి…..