చమట ఎక్కువగా పడితే, దేనికి సంకేతమో తెలుసా….?

చెమట అనేది కొంతమందికి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. పెద్ద వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా చూస్తాము కొంత మంది టీనేజర్లలో కూడా వారి డ్రెస్సులు చెమటతో తడిసి పోవడం అనేది చూస్తూ ఉంటాం, మరికొంత మందికి విపరీతంగా అనేది వస్తూ ఉంటుంది.మనకు బాడీలో ఆయుర్వేద ప్రకారంగా చూస్తే వాత,పిత్త ,కఫ దోషాలు అనేవి ఉంటాయి. పిత్త అనేది ఎప్పుడైతే ఎలివేట్ అవుతుందో అప్పుడు మనకు బాగా చెమట రావడం అనేది జరుగుతుంది. శరీరంలో హిట్ అనేది జనరేట్ అయిపోయి చెమట రావడం మొదలవుతుంది.చెమట అనేది ఎక్కువ వట్టిన ప్రాబ్లమే తక్కువ పట్టినా కూడా ప్రాబ్లమే. చెమట రావడం వల్ల మనకు ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది, ఎప్పుడైనా ఎక్ససైజ్, వర్కౌట్స్ బరువు తగ్గడం కోసం చేసినప్పుడు ఎంత స్వెట్ బయటికి వస్తే మన బాడీ లో అంత టాక్సిన్స్ కూడా బయటికి వెళ్ళాలి.చెమట పట్టకుండా ఉండే వాళ్ళని చూస్తే వాళ్ళ స్కిన్ అనేది కొంచెం మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంది.

కానీ చెమట పట్టడం అనేది చాలా మంచిది, చెమట ఎంత ఎక్కువగా పడితే బాడీ అంతా రిలాక్స్ అవుతుంది, కాబట్టి డైలీ కాస్త చెమట పట్టడం అనేది మన బాడీకి అవసరం. కొంతమందికి సడన్ గా చమటలు ఉంటాయి, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వల్ల ఇలా వస్తాయి.కొంతమంది మెడిటేషన్ లాంటివి చేసినప్పుడు ఇలా ఎక్కువగా చెమటలు వస్తాయి. కొంతమందికి ఎంత చెమటలు పట్టిన కూడా వారికి స్మెల్ రాదు. కొంతమందికి కాస్త చెమటకి స్మెల్ విపరీతంగా వచ్చేస్తుంది. ఇలా స్మెల్ రాకుండా ఉండడానికి ఎక్కువగా పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు, మరికొంతమంది స్నానం చేయకుండానే వీటిని వాడుతారు.దీనివల్ల స్కిన్ డిసీజెస్ ఎక్కువ అవుతాయి. ఎక్కువ చెమట పట్టే వారు వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, బట్టర్ మిల్క్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి.

మజ్జిగను పల్చగా చేసుకుని త్రాగడం లాంటివి చేస్తూ ఉండాలి. చెమట ఎక్కువ పట్టే వారు రెండు పూటలా స్నానం చేయడం చాలా చాలా మంచిది.మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉసిరి పొడిలో నెయ్యి మరియు బెల్లం ఈ రెండు కలిపి రోజు మార్నింగ్, ఈవినింగ్ తినాలి. ఇలా తినడం వల్ల ఇంచుమించు చెమట అనేది కంట్రోల్ లో ఉంటుంది అలాగే చెమట నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉందో అది కంట్రోల్ అవుతుంది,ఇది ఒక హోమ్ రెమిడి.ఈ రెమిడీ లోమనం తీసుకునే ఏ పదార్థాలు అయినా సరే ఒక్క స్పూన్ మాత్రమే తీసుకోవాలి. చెమట ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉన్నవారు రోజుకు మూడు సార్లు తీసుకోవచ్చు. ఉసిరి పొడిలో కొంచెం బెల్లం నెయ్యి వేసి ఈ మూడింటిని ఓకే క్వాంటిటీ లో తీసుకుని కలుపుకుని తింటే మీకు ఈ చెమట అనేది రావడం కంట్రోల్ అవుతుంది.

దీంతో పాటు మన బాడీ ని కూడా హైడ్రేట్ గా ఉండేటట్లు చూసుకోవాలి, వేసుకునే బట్టలు కూడా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి, మీరు స్నానం చేసే వాటర్ లో జాస్మిన్ ఆయిల్ ఒక 2 చుక్కల వరకు వేసుకుని స్నానం చేస్తే బ్యాడ్ స్మెల్ అనేది తగ్గిపోతుంది. మరొక బెస్ట్ రెమిడీ ఏమిటంటే ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కలను బాగా మిక్సీకి వేసి పేస్ట్లా చేసుకోండి.దీని నుండి జ్యూస్ ను తీసుకొని దీనిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకోండి ఇలా ఈ నీటితో స్నానం చేస్తే చాలా ఫ్రెష్ గా ఉంటారు. మనకు నార్మల్గా బాత్ జెల్స్, షవర్ జెల్స్ దొరుకుతూ ఉంటాయి కానీ వాటిలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి, ఇలా ఆరెంజ్ తొక్కలతో తయారుచేసిన జ్యూస్ తో చేసినట్లయితే మీకు ఒక రకమైన ఫ్రెష్నెస్ నాచురల్ గా ఉంటుంది మరియు ఎక్కువగా ఉంటుంది.