చాలా ఏళ్ల తరువాత

జ్యోతిష్య శాస్త్రుల నిపుణుల అభిప్రాయం ప్రకారం రాజయోగం రెండు రకాలుగా ఉంటుంది. ఈసారి ఏర్పడే రాజయోగం ఏ రాశుల వారిపై సానుకూల ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం ఆధారంగా అంచనాలు ఉంటాయి కాబట్టి జ్యోతిష్యా నిపుణుల ప్రకారం గ్రహాల సంచారం అతి ముఖ్యమైనది. ప్రతి గ్రహము సంచారకాలం భిన్నంగా ఉంటుంది కాబట్టి ఒకటికంటే ఎక్కువ గ్రహాలు ఒక రాశులు వస్తాయి కాబట్టి కొన్ని శుభ అశుభయోగాలు ఏర్పడతాయి.

ముఖ్యంగా ఈ మాసం 24వ తేదీ న గ్రహాల స్థానం అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా అదృష్టం పట్టబోతున్న మొదటి రాశి ధనస్సు రాశి వారు, ఈ యొక్క ధనస్సు రాశి జాతకులకు శుక్రుడు మరియు సూర్యుడు లాభదాయకంగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కాలంలో వ్యక్తులు వ్యాపారంలో లాభాలతో పాటు వృత్తిలో మంచి ఫలితాలను పొందుతారు ఇదే సమయంలో జీతభత్యాలు ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి. విదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు, కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి,

ఉన్నత మార్గాల ద్వారా ఉన్నత స్థితికి చేరుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి వృత్తి ఆర్థికపరమైన జీవితం మొదలైన వాటికి సంబంధించి మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో విద్యకు సంబంధించిన అనేక సమస్యల నుండి బయటపడతారు, ఇంట్లో అంగారకుని కారణంగా చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం గురించి మాట్లాడితే వివాహ గృహానికి అధిపతి అయినటువంటి బుధుడు ధనస్సు రాశి వారికి సూర్యుడుతో కలిసి బుధాదిత్య యోగం ఏర్పరుస్తాడు,

దీని ఫలితంగా పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఆహ్లాదకరంగా ఉంటారు, కెరీర్ కు సంబంధించి ఉన్నతమైన ప్రోత్సాహ విలువలు కూడా మీలో కలుగుతాయి, ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారు, సేవ చేసే వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది, పదోన్నతులు లభిస్తాయి. తర్వాత రాశి మీన రాశి వారు, మీన రాశి వారికి కుజుడు మరియు బుధ గ్రహాల సంచారం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి చిక్కుకున్న డబ్బు దొరుకుతుంది దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు అన్ని తీరిపోతాయి. వ్యాపారానికి కూడా ఇది మంచి సమయం కావచ్చు వ్యాపార విస్తరణ కోసం పాటుపడతారు వ్యాపారంలో కూడా మంచి లాభాలను పొందుతారు.

ఈ రాశి వారికి ఆందోళన సమస్యలతో నిండి ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించగలుగుతారు. కుటుంబం మద్దతు ఇంట్లో పుష్కలంగా ఉంటుంది, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఖర్చులను నియంత్రణ లో ఉంచుకుంటే మంచిది. దీంతో పాటు కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య గందరగోళం ఏర్పడుతుంది కాకపోతే వచ్చేటటువంటి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు కూడా మీకు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ గృహానికి అధిపతి అయిన చంద్రుడు రాహుతో కలయిక వల్ల శని యొక్క అంశ ఇంటిపై ఉంటుంది, ఈ రాశి వారు పురోగతిని సాధిస్తారు మీ జీవితం కొత్త మలుపులు తిరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

వృశ్చిక రాశి, ఈ రాశి వారికి శుక్రుడు మరియు సూర్యుడు ఈ రాశి వారికి ఎన్నో లాభాలను ఇవ్వబోతున్నారు. కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి, వ్యాపారంలో పెరుగుదల ఆర్థిక స్థితి కూడా బలంగా ఉంటుంది, ఆర్థికపరమైన స్థితిగతులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి కెరియర్ పరంగా అన్ని అనుకూలంగా ఉంటాయి.తర్వాత రాశి వారు మిధున రాశి వారు, ఈ మిధున రాశి వారికి సంవత్సరం మొత్తం లాభదాయకంగా ఉంటుంది, ఉద్యోగంలో జీతం ఉన్నవారు ప్రమోషన్లు పొందుతారు, కార్యాలయంలో ప్రశంసలు మరియు ఆదాయం కూడా పెరుగుతుంది.

ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఉన్నతమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగం కోసం కూడా ఎదురుచూస్తున్న వారు అద్భుత లాభాలను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సూర్యుడి అంశ పదవ ఇంటిపై ఉంటుంది ఇది దీన్ని ఉద్యోగ మార్చడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, శని సొంత రాశిలో 8వ ఇంటిలో ఉంటాడు దీనికి కారణంగా విదేశీ మూలాల నుండి కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, విద్య పరంగా కూడా మిధున రాశి వారికి అద్భుత అవకాశాలు రాబోతున్నాయి. దీంతోపాటు రాహువు యొక్క సంచార స్థితిగతుల కారణంగా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి.