చూడడానికి తరలివస్తున్న జనం

సుప్రసిద్ధ శ్రీ కుక్కే సుబ్రమణ్య స్వామి దేవాలయం కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లా సిల్వర్ తాలూకాలోని సుబ్రహ్మణ్యం గ్రామంలో ఉంది. ఇక్కడ కార్తికేయునిది సర్వదేవుని సుబ్రహ్మణ్యుడిగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు.

గరుడకి భయపడే దివ్య స్వరమైన వాసుకి మరియు ఇతర సర్పాలు సుబ్రహ్మణ్యం చేత శరణు పొందాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటకలోని సుందరమైన పశ్చిమ కనుమలు ఉంది.

దేవస్థానం వెనుక వైపు సుప్రసిద్ధమైన కుమార పర్వతం ఉంది, దక్షిణ భారత పర్వతారోహిన్లకు కుమార పర్వతం ఎంతో ఇష్టమైన ప్రదేశం. దేవస్థాన ప్రవేశ మార్గానికి పర్వతం అందాన్ని తెచ్చి పెట్టింది, దేవస్థానాన్ని పడక విప్పి కాస్తున్న ఆరు సర్పాల కాలనాగుపాము శేష పర్వతంలోనే ఉంటుంది. ఈ దేవస్థానం పశ్చిమ కనుమన పశ్చిమ వైపు వంపులో దట్టమైన పచ్చని అడవులతో కప్పబడి ఉంటుంది. అత్యంత రమనీయమైన అందాల నడుమ ఉన్న సుబ్రహ్మణ్య గ్రామంలో దేవస్థానం కొలువై ఉంటుంది.

మన దేశంలో ఇంతటి అందమైన ప్రదేశాలు చాలా అరుదుగా ఉన్నాయి. గ్రామం మధ్యలో దేవస్థానం ఉంటుంది, చుట్టూ పర్వతాలు కొండలు, జలపాతాలు ఉండడం వలన ఇది ఒక ప్రకృతి అద్భుతం అని చెప్పుకోవచ్చు. తీర పట్టణమైన మంగుళూరు నుంచి 105 కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం వుంది మంగళూరు నుండి రైలు బస్సు టాక్సీ ల ద్వారా దేవస్థానాన్ని చేరుకోవచ్చు, సుబ్రహ్మణ్య గ్రామానికి పూర్వంలో కుక్క పట్టణం అనే పేరు ఉంది, ఈ క్షేత్రాన్ని దర్శించే యాత్రికులు కుమ్ర ధార నిదిని దాటి దేవస్థానాన్ని చేరుకోవాలి. సుబ్రహ్మణ్య దర్శిస్తానానికి ముందు భక్తులు పవిత్ర కుమార్ ధార నదిలో మునిగి రావడం ఆనవాయితీ. దేవస్థానం వెనుక తలుపుల గుండా భక్తులు గుడి ప్రాంగణానికి చేరుకొని, మూలవిరాట్ చుట్టూ ప్రదక్షణలు చేసి వస్తారు.

మూలవిరాట్ కు ముఖ్యద్వారానికి మధ్య వెండి దాపడం చేయించబడిన గరుడ స్తంభం వుంది. వశీకరించబడిన గరుడ స్తంభం లోపల నివాసం ఉన్న మహాసర్పం వాసుకి ఊపిరి నుండి వెలువడే విష కీలకల నుండి భక్తులు కవచంలా కాపాడడానికి ప్రతిష్టించబడిందని నమ్మకం. స్తంభం తర్వాత బాహ్య మందిరం అంతర మందిరం సుబ్రహ్మణ్యం దేవుడి గుడి ఉన్నాయి, గుడికి సరిగ్గా మధ్యలో పీఠం ఉంటుంది. పీఠం పై భాగంలో సుబ్రహ్మణ్యస్వామి వాసుకిల విగ్రహాల కింద భాగంలో శేషనాగు విగ్రహం ఉంటాయి. ఈ విగ్రహాలకు నిత్య కర్మ ఆదరణ పూజలు జరుగుతూ ఉంటాయి. పవిత్రత మరియు ప్రాముఖ్యత వలన ఈ దేవస్థానం దినదిన ప్రవర్తమానం చెందుతూ, చాలా వేగంగా అభివృద్ధి ప్రజాదరణ పొందుతుంది. ఇక స్వామికి పూజలు చేసే సమయంలో ఆకాశంలో సుబ్రహ్మణ్య రూపం కనిపిస్తుందని, పౌర్ణమి పూట స్వామి అలా కనిపించడంతో చాలామంది అది చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇదంతా స్వామి మహిమ అని భక్తులు ప్రకారంగా నమ్ముతూ ఉంటారు.