చేతబడి చేశారన్న అనుమానం మీలో ఉంటె వెంటనే ఈ విధంగా చేస్తే పోతుంది

చాలామంది పూజలు పునస్కారాలు బాగా శ్రద్ధగా చేస్తూ ఉంటారు, మానవులకి కష్టాలు సహజంగా వస్తాయి, అయితే అవి కోరుకునే తెచ్చుకున్నవి కావు కానీ, దైవికంగా మన ప్రారబ్ద కర్మానుసారం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.

ఈ ఇబ్బందులను ఎదుర్కొనే సమయంలో ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి అనేకమందిని ఆశ్రయిస్తారు. దేవాలయాలకు వెళ్తారు, సేవలు చేస్తారు వైద్యుల దగ్గరికి వెళతారు, వ్యాధులు అయితే వైద్యుల దగ్గరికి వెళ్తారు, ఇంకా వేరే రకమైన ఇబ్బందులు ఎదురైతే ఇంకా వేరే వేరే ప్రయత్నాలు అనేకం మంత్రాలు వేసే వాళ్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు,

లేదా ఇంకా చాలా మందికి అపోహ ఏమిటి అంటే మాకు ఎవరైనా దానిని ప్రయోగం అంటారు, చేతబడి మొదలైనవి చేశారేమో నన్న అపోహ కూడా ఉంటుంది. అందుకోసం అలాంటి వారి దగ్గరికి తగ్గించే వారి దగ్గరికి అలా వెళుతూ ఉంటారు, అంటే ఆ బాధ తొలగిపోవాలన్నా ప్రయత్నం తీవ్రంగా చేస్తూ ఉంటారు.

అయితే ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే, అసలు నిజంగా ఈ చేతబడి ఉందా లేదా, అంటే ఒక్కటే ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా, అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది అయితే ఒకవేళ లేకనే పోతే ఉన్నాడా లేదా అనే సందేహమే రాదు, ఆ ప్రశ్ననే రాదు, ఉన్నాడు కాబట్టే ఉన్నాడా లేడా అనే సందేహం కొందరిలో కలుగుతుంది. అదే మాదిరిగా దేవుడు ఎంతవరకు నిజమో, దయ్యం కూడా అంతవరకే నిజం, మన మీద ఎవరైనా శత్రుభావం కలిగి,లేదా ఈర్ష అసూయలతో చేసే వాటిని ప్రయోగం అంటారు. దానినే చేతబడి అని అంటారు. అయితే ఇది అంతా తీవ్రస్థాయిలో మనం ఒకానొక కాలంలో కూడా, మన పెద్దలు అనుభవించిన ఉదాహరణలు చెబుతారు మనకి, మంత్ర శాస్త్రంలో ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిని అనుసరించి వాళ్ళు ఆ మంత్రాలను పఠించి మన మీద ప్రయోగం చేస్తారని, ఈ గోర్లు వెంట్రుకలు లేదా మొదలైన వాటి ద్వారా ప్రయోగాలు జరిపిస్తారని, ఇప్పటికే కూడా వాటిని తొలగించే ప్రయత్నం చేసుకుంటారు, మన మనసు బాధలు అనుభవించేటప్పుడు, బలహీనమవుతుంది, ఈ బలహీనమైన మనసు మీద ఎవరు మన పక్క వాళ్ళు ఏది చెప్తే దానిని మనం విశ్వసిస్తూ పోతూ ఉంటాం.

అయితే ప్రయోగం అనేది ఒకానొక వ్యక్తి ఎవరికైతే ఆత్మస్థైర్యం సంపూర్ణంగా ఉంటుందో, దైవ బలం సంపూర్ణంగా ఉంటుందో, వారికి ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసిన చేద్దామనుకున్నా, ఏ మాత్రం ఫలించదు, ఫలించక పోగా మళ్ళీ తిరిగి వాళ్లకే వ్యతిరేకమైన అనుభవాలను పొందుతారు. ఎవరు వేరు మీద ప్రయోగం చేయాలని చూశారు తిరిగి వాళ్లకే ఆ ప్రయోగం అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి, అటువంటి సమయంలో మనం ఎలాంటి కష్టం వచ్చినా ఎంత నష్టం జరిగిన మనం ఆత్మస్థైర్యం కోల్పోకుండా, ఎవరైతే ధైర్యంగా ఉంటారు, లేదా దైవబలం సంపూర్ణంగా పొందుతారో, అలాంటి వ్యక్తులకి ఈ ప్రయోగాలు కానీ గ్రహాలు కానీ ఏ మాత్రం బాధించకుండా ఉంటాయి . అలాంటి ప్రయత్నం మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి.

దైవబలం ఊరికే రాదు కేవలం కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్లి సేవలు చేసే మొక్కులు మొక్కే ముడుపులో చెల్లించినంతమాత్రాన సరిపోదు, మనం సంతోషంగా ఉన్న సమయంలో కూడా, ఆ దైవాన్ని వదిలిపెట్టకుండా ఉంటే అప్పుడు మనకు దైవ బలం సంపూర్ణంగా వస్తుంది, కేవలం సమస్య వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరకు వెళ్లినట్టు కాకుండా, సమస్యలు ఉన్నా లేకున్నా దైవభక్తి యందు శ్రద్ధతో మనం కలిగి ఆ ఉపాసన కానీ ఆ మంత్రాన్ని కానీ దైవదర్శనాన్ని కానీ, ఆ తీర్థ ప్రసాదాలు కానీ శ్రద్ధగా తీసుకున్నట్లయితే, దైవ బలం మనకు సంపూర్ణంగా ఉంటుంది.