ఈనెల 29 గురువారం ఆషాడమాసంలో తొలి ఏకాదశి రానుంది. ఈ తొలి ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనది, ఈ ఏకాదశి నుండే పండగలన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. తొలి ఏకాదశి రోజున ఉపవాసాన్ని పఠించే వారికి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి.
అదే విధంగా ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే, వారి భర్త బాగా సంపాదించి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైనా ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు తొలి ఏకాదశి రోజున ఈ రంగు దుస్తులను ధరించిన తర్వాత, 15 రోజులకి ఒకసారి ఉపవాసాన్ని పట్టించాలి అనుకునేవారు ఈ తొలి ఏకాదశి నుండి ప్రారంభిస్తే, వారి జీవితం ధన్యమైపోతుంది.
పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. తొలి ఏకాదశి అనగానే ఒక పండగ అని చెప్పుకోవచ్చు, తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు. అంటే ముందుగా ఏకాదశి ప్రారంభమైన తర్వాతే పండుగలు అన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి పండగ అనేది వస్తూ ఉంటుంది. ఏకాదశి రోజున ముఖ్యంగా తినవలసింది పేలాల పిండి, ఈ పేలాల పిండి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తినాలి అని శాస్త్రం చెబుతుంది.
పూర్వకాలం నుండి కూడా వస్తున్న ఆచారం ఇది. పేలాల పిండి ప్రతి ఏకాదశి తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది అని పెద్దలు చెబుతున్నారు. ఈ పేలాల పిండిలో బెల్లము యాలకులు వేసి తయారు చేసి ఆ పిండిని నైవేద్యంగా పెట్టి ఇతరులకు కూడా పిండిని పంచి తర్వాత మనం తీసుకోవడం వల్ల, ఆరోగ్యం బాగుంటుంది అని శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం పటిస్తారు, అలాంటి వారికి ఎన్ని బాధలు కష్టాలు ఆర్థిక సమస్యలు ఉన్న అన్ని తొలగిపోయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది.
తొలి ఏకాదశి రోజున ఆడవారు ఆకుపచ్చ రంగు చీరను కానీ లేదా ఎరుపు రంగు లేదా పసుపు రంగు చీరను కానీ కట్టుకోవాలి. ఆ మూడు రంగులలో ఏ చీరను కట్టుకున్న లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మగవారు కూడా ఇదే రంగు బట్టలను ధరించాలి. ఆడవారు పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు బంగారు రంగులో ఉండే గాజులను ధరించాలి. అలా ధరిస్తే మీ భర్త ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.