జూ.. ఎన్టీఆర్ చేసిన పని తెలిస్తే ఎవ్వరైనా ఫ్యాన్ అవుతారు

ఎన్టీఆర్ ఇంట్లో పని చేసే పనిమనిషికి, వాళ్ల కూతురు పెళ్లి కోసం ఎన్టీఆర్ చేసిన సహాయం తెలిస్తే నిజంగా చాలా చాలా గొప్ప వ్యక్తులు మాత్రమే, ఇలా చేస్తారు అనిపిస్తుంది. దాదాపు పెళ్లి బాధ్యతనంత చూసుకోవడమే కాదు, 20 లక్షల డబ్బును కూడా అదనంగా ఇచ్చారట తారక్. ఎందుకంటే ఆమె ఎంతో కాలంగా దాదాపు 20 ఏళ్లకు పైగానే తన ఇంట్లో ఎంతో నమ్మకంగా ఉంటుందట,

అందుకే ఆమె అంటే ఇంట్లో అందరికీ అభిమానం. ఇక ఆమె కూతురు పెళ్లి కూడా ఎంతో ఘనంగానే జరిపించారట తారక్. అలాగే ఆ పెళ్లి ఖర్చులకు 20 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆవిడే చెబుతోంది. నిజంగా తారక్ వాళ్ళింట్లో పనిచేయడం మననేది ఎన్నో జన్మల పుణ్యం అనేది, అటువంటి ఎంతో మంచి వ్యక్తిని అసలు చూడలేదు అంటూ, ఇంట్లో చాలా మంది అలాంటి వాళ్ళని పని వారిని ఇంట్లో కేవలం పని వాళ్ళ లాగా చూసేవారు కానీ,

మమ్మల్ని కూడా ఒక భండంతో పిలుస్తూ పిన్ని బాబాయ్ అంటూ పలకరిస్తారు. అటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా చెప్పండి. అలాగే ఆయన మా ఇంట్లో వేడుకని ఎంతో చక్కగా వాళ్ళ ఇంట్లో వేడుకలాగా జరిపించి, అన్నిటికీ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఆడుగుతో తెలుసుకుంటూ, ఆయనే అన్ని జరిపించడమే కాదు,

చివరికి 20 లక్షలు ఆయన క్యాష్ కూడా ఇచ్చారు. దీంతో ఎంతో చక్కగా తన కూతురికి పెళ్లి చేసి పంపించడమే కాదు, మిగతా అబ్బాయికి కూడా ఫీజులు కట్టాల్సినవి ఉంటే అవన్నీ కూడా కట్టేశారు. మొత్తానికి నా ఇంట్లో దీపం పెట్టాడు ఎన్టీఆర్ అంటూ, ఎంతో గొప్పగా ఎన్టీఆర్ ఇంట్లో పనిమనిషి చెప్తుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజంగా తారక్ గొప్ప మనసు చూసి అందరినీ కూడా తనవాళ్లుగా భావించి తన తత్వాన్ని చూసి ఫాన్స్ మురిసిపోయారు.