టాబ్లెట్ వాడకుండా నరాల బలహీనత శాశ్వతంగా దూరం

నరాల బలహీనతను నిమిషాల్లో తగ్గించే డ్రింక్ ఇదే. ఒక్కసారి ట్రై చేయండి, చాలామందిని వేధిస్తున్న సమస్యలలో బలహీనత ఒకటి.. ఈ సమస్య ఉన్నవారిలో కాళ్లు చేతులు వనకడం, కళ్ళల్లో నుండి నీరు కారడం, గుండె దడ ఎక్కువగా ఉండడం, బరువులు మోయలేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మీకు కూడా నరాల బలహీనత వ్యాధి ఉందా? ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారా? ఎ

న్ని చేసినా నరాల బలహీనతను అరికట్టలేకపోతున్నారా? అయితే ఈ చిట్కాను ఫాలో అవ్వండి ,మనిషికి అష్టైశ్వర్యాలు ఉన్న ఆరోగ్యం లేకపోతే మాత్రం అవన్నీ వ్యర్థమే. అందుకే ఎప్పుడూ సంపాదన కోసం పాకులాడమే కాదు ఆరోగ్యాన్ని కూడా కాస్త జాగ్రత్తగా కాపాడుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. మనిషిని పీడించే వ్యాధులు ఎన్ని ఉన్నా ఒక్క నరాల బలహీనత వ్యాధి ఉంటే మాత్రం ఆ వ్యక్తి బాధలు వర్ణనాతీతం అని చెప్పాలి.

కొంతమంది ఎన్ని మందులు వాడినా ఆ నరాల బలహీనతను అరికట్టలేకపోతున్నారు. అలాంటివారు క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తూ క్రమం తప్పకుండా చెప్పులు లేకుండా గడ్డిలో నడవడం వల్ల నరాలలో కదలిక వచ్చి రక్త ప్రసరణ బాగా జరిగి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే సూర్య రష్మిలో డి విటమిన్ ఉంటుంది కాబట్టి, ప్రతిరోజు కొద్దిసేపు లేత ఎండలో ఉండాలి. మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

వాల్నట్స్ ,బచ్చలి కూర ,పుచ్చకాయ ,అరటిపండు వంటి ఎక్కువగా తినాలి. ఇవన్నీ కూడా నరాలని గట్టిపరుస్తాయి ,రోజు కొద్ది దూరం తప్పకుండా నడవాలి ,పాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా పాలు తాగాలి, గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి తాగుతూ ఉండాలి. రెగ్యులర్గా బాడీ మసాజ్ చేయించుకుంటూ ఉండాలి, షుగర్ వ్యాధి ఉన్నవారిలోనూ మద్యం సేవించే వారిలోనూ శాకాహారులలోను ఎక్కువగా నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది.

కొన్ని రకాల జ్వరాల వల్ల కూడా నరాల బలహీనత వస్తుంది. అలాంటి సమయాలలో కొన్ని ఇంజక్షన్లను చేయించుకోవడం, ఫిజియోథెరపీ చేయించుకోవడం వంటివి చేయాలి. మరి అందరికీ ఇది చేయించుకోవడం సాధ్యం అవుతుందా అంటే అవ్వదనే చెప్పాలి. ఇలా సాధ్యం కాని వారు ఈ హోమ్ రెమెడీతో నరాల బలహీనతను తరిమికొట్టవచ్చు మరి ఆ హోమ్ రెమిడి ఏమిటో చూద్దాం.నరాల బలహీనతకు చెక్ పెట్టే ఈ హోమ్ రెమిడీ కోసం మనకు కావాల్సిన పదార్థాలు నల్ల జీలకర్ర, మెంతులు , అశ్వగంధ. ముందుగా 50 గ్రాముల నల్ల జీలకర్ర ,50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల అశ్వగంధ వేరు తీసుకుని గ్రైండర్ లో వేసి మెత్తగా పొడి చేయాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున త్రాగాలి,అలాగే డిన్నర్ కి అరగంట ముందు త్రాగాలి. ఇలా కనీసం 21 రోజులపాటు త్రాగితే నరాల బలహీనత బాడీ పెయింట్స్ ఇంకా ఉదర సంబంధిత వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.