‘డీ’ జడ్జి పూర్ణ డాన్స్ మాములుగా లేదు

టాలీవుడ్(తెలుగు) బుల్లితెరపై డాన్సుల పరంగా బాగా పాపులర్ అయిన షో ఢీ. ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ కొరియోగ్రఫర్స్ వచ్చారు. శేఖర్ మాస్టర్ లాంటి డాన్స్ మాస్టర్స్ కూడా ఈ షో నుంచే వచ్చారు. ఇదిలా ఉంటే ఈ షోపై ఇప్పుడు కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇందులో బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అయింది అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

దానికి కారణం కూడా లేకపోలేదు, పేరుకు మాత్రమే డాన్స్ షో అయినా కూడా అందులో సుడిగాలి సుదీర్, హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ చేసే కామెడీ హైలైట్ అవుతుంది. కేవలం వాళ్ల కోసమే షో చూసే వాళ్లు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే జడ్జిలు కూడా అప్పుడప్పుడూ చేస్తున్న కాస్త ఓవర్ యాక్షన్ విమర్శలకు తావిస్తుంది.

తాజాగా జడ్జి పూర్ణ చేసిన పనికి సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఆమెతో పాటు ఈ షోను ప్రియమణి, శేఖర్ మాస్టర్ జడ్జ్ చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు పూర్ణ చేసిన పని మాత్రం వైరల్ అవుతుంది. ఓ కంటెస్టెంట్ బుగ్గ అందరూ చూస్తుండగానే కొరికేసి వార్తల్లో నిలిచింది పూర్ణ. అసలేం జరిగిందంటే.. రెట్రో ఎపిసోడ్స్ కారణంగా పాత పాటలకు డాన్సులు చేసారు కంటెస్టెంట్స్. ఈ క్రమంలోనే ఓ కంటెస్టెంట్ ఆకాశంలో ఆశల హరివిల్లు పాటకు డాన్స్ చేసింది. రెట్రో సాంగ్‌కు మోడ్రన్ స్టెప్స్ జోడించి అదరగొట్టింది ఆ కంటెస్టెంట్. సాంగ్ అయిపోయిన తర్వాత ఢీ జడ్జిలు బాగా ఎమోషనల్ అయిపోయారు.

టాలీవుడ్(తెలుగు) బుల్లితెరపై డాన్సుల పరంగా బాగా పాపులర్ అయిన షో ఢీ. ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ కొరియోగ్రఫర్స్ వచ్చారు. శేఖర్ మాస్టర్ లాంటి డాన్స్ మాస్టర్స్ కూడా ఈ షో నుంచే వచ్చారు. ఇదిలా ఉంటే ఈ షోపై ఇప్పుడు కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇందులో బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అయింది అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు, పేరుకు మాత్రమే డాన్స్ షో అయినా కూడా అందులో సుడిగాలి సుదీర్, హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ చేసే కామెడీ హైలైట్ అవుతుంది. కేవలం వాళ్ల కోసమే షో చూసే వాళ్లు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే జడ్జిలు కూడా అప్పుడప్పుడూ చేస్తున్న కాస్త ఓవర్ యాక్షన్ విమర్శలకు తావిస్తుంది.