తండ్రిని మించిన ప్రేమ ను చూపించిన పవన్ కల్యాణ్ ఏకంగా వరుణ్-లావణ్య కోసం పవన్ ఏం చేసాడో తెలుసా

టాలీవుడ్ యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అలానే అందాల నటి లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ నిన్న హైదరాబాద్ మణికొండ లోని మెగాబ్రదర్ నాగబాబు ఇంట ఎంతో వైభవంగా జరిగింది. కాగా వరుణ్ తేజ్ తో పాటు లావణ్య ల ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో పలువురు మెగా ఫ్యామిలీ కుటుంబసభ్యలు సందడి చేసారు. అతి త్వరలో

వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరుగనుంది.విషయం ఏమిటంటే, వీరిద్దరి ఎంగేజ్మెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేసారు. కాగా నిహారిక, మెగాబ్రదర్ నాగబాబు, ఆయన సతీమణి పద్మజ తో పాటు నూతన జంట తో కలిసి పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెండీ స్టైల్ కలెక్షన్ కాస్ట్యూమ్స్ లో పవన్ ని చూడవచ్చు. ఇక ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ మరోవైపు త్వరలో తన జనసేన పార్టీ తరపున వారాహి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు.